Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. నాలుగు వారాల క్రితం వరకు ఈమె ఆడియన్స్ కి బాగా నచ్చేది. ఎందుకంటే టాస్కులు బాగా ఆడుతుంది, చూసేందుకు అందంగా, క్యూట్ గా ఉంటుంది, మనసులో ఏది ఉంటే అది భయం లేకుండా ముఖం మీదనే చెప్పేస్తుంది అని. కానీ ఈమధ్య కాలం లో ఈమె తాను ఇన్ని రోజులు వేసుకొని తిరిగిన ముసుగుని పూర్తిగా తీసి పారేస్తోంది. తన స్వార్థం కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా ఈమె వ్యవహార శైలి ఉంది. ఆమె అభిమానులు ఈ కథనం చూసి మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు. కానీ అనిపించిన విషయాన్ని చెప్పక తప్పదు, ఎందుకంటే మంచి కంటెస్టెంట్ టాప్ 5 వరకు రావాలి అనేదే మా ఉద్దేశ్యం. ప్రేరణ కి స్నేహం పట్ల అసలు విలువ లేదు, కేవలం తనకి డేంజర్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే ఈమె స్నేహాన్ని వాడుకుంటుంది అనేది ఇటీవల అనేక సందర్భాలను గమనించిన తర్వాత అర్థమైంది.
ఉదాహరణకి ఈమెకు హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ యష్మీ. యష్మీ ఈమెను తన స్నేహితురాలిగా భావించి ఆమెని ఎన్నో క్లిష్టమైన సమయాల్లో సేవ్ చేసింది కానీ, ప్రేరణ మాత్రం ఒక్కసారి కూడా యష్మీ కోసం నిలబడలేదు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా నిజం. మొదటి ఎపిసోడ్ నుండి చూసిన వాళ్లకు ఇది అర్థం అవుతుంది. నామినేషన్స్ నుండి సేవ్ చేసే పవర్ ఉన్నప్పుడు కూడా ఈమె యష్మీ ని కాపాడకుండా, తనతో రెండు వారాల నుండి గొడవ పడుతున్న పృథ్వీ ని సేవ్ చేస్తుంది. అప్పుడే ఆడియన్స్ కి అర్థమైంది, ఈమె కేవలం స్నేహం నటిస్తుంది, యష్మీ ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటుంది అని. దానికి మరో ఉదాహరణ కూడా దొరికింది. నిన్న రాత్రి లైవ్ లో ఈమె నబీల్ తో చర్చిస్తూ యష్మీ ఎలిమినేట్ అవ్వనందుకు బాధ పడుతుంది.
నబీల్ తో మాట్లాడుతూ ‘ఈ వారం నేను గౌతమ్, విష్ణు ప్రియ, యష్మీ లు డేంజర్ జోన్ లో ఉన్నారని అనుకున్నారు. యష్మీ అయితే డేంజర్ జోన్ కాదు, ఏకంగా ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నాను. కానీ ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు’ అని అంటుంది. స్నేహితురాలి గురించి ఎవరైనా ఇలా మాట్లాడుతారా?, యష్మీ ఎన్నోసార్లు తనకి సహాయం చేసింది అనే విశ్వాసం కూడా చూపించట్లేదు. అంతే కాదు అవినాష్ ని నబీల్ ‘ఎవిక్షన్ పాస్’ ఉపయోగించి సేవ్ చేయడం కూడా ఆమెకు నచ్చలేదు. అవినాష్ ని సేవ్ చేయకపొయ్యుంటే ఎలిమినేట్ అయ్యేవాడు, అతను ఎలిమినేట్ అయితే మనకి పోటీ తగ్గుతుంది కదా అని అంటుంది. అవినాష్ తో ఈమె ఎంత స్నేహం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవినాష్ ప్రేరణ తనకి నిజమైన స్నేహితురాలు అని అనుకుంటున్నాడు. ఈ విషయం అవినాష్ కి తెలిస్తే ఎంత బాధపడుతాడు? , మీరే ఆలోచించండి. ప్రేరణ ఏమైనా విలువలు పాటిస్తుందా?, ఈమె హౌస్ లో ఉండాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి.
E Prerana ni petandi bottom 2 lo next week
Bayata PR ni set cheskundi ani Balupu#BiggBossTelugu8 pic.twitter.com/VuBwIC89oz— . (@flexdayzz) November 17, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 prerana kambam feels sad that yashmi was not eliminated
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com