https://oktelugu.com/

Bigg Boss Telugu 8: కంటెంట్ కోసం నయనీ పావని ఓవర్ యాక్షన్.. గౌతమ్ లో మ్యాటర్ లేదంటూ కామెంట్స్!

ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నేటి ఎపిసోడ్ లో ఈమె కావాలని ఉద్దేశపూర్వకంగా గౌతమ్ తో గొడవ పెట్టుకున్నట్టు అందరికీ అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నయనీ పావని, అవినాష్, టేస్టీ తేజ మధ్య కిచెన్ విషయం లో కాస్త సీరియస్ చర్చలు నడుస్తూ ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 8:28 am
    Bigg Boss Telugu 8(189)

    Bigg Boss Telugu 8(189)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో ప్రేక్షకులు బాగా అంచనాలు పెట్టుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నయనీ పావని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె గత సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గానే హౌస్ లోకి అడుగుపెట్టింది. అందరితో తక్కువ సమయంలోనే బాగా కలిసిపోయి గేమ్స్ ఆడినప్పటికీ ఎందుకో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో ఈమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆడియన్స్ అందరికీ ఈ అమ్మాయికి ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండును అని అనుకున్నారు. ఆడియన్స్ కోరికకు తగ్గట్టుగానే ఈమెకు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ దొరికింది. కానీ రాకరాక వచ్చిన అదృష్టాన్ని నయనీ పావని ఎందుకో సరిగా ఉపయోగించుకోలేదని అందరికీ అనిపించింది. తనకి టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం తనవైపు నుండి బెస్ట్ అయితే ఇచ్చింది కానీ, ప్రతీ దానికి ఓవర్ రియాక్షన్ ఇవ్వడం ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు.

    అందుకే ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నేటి ఎపిసోడ్ లో ఈమె కావాలని ఉద్దేశపూర్వకంగా గౌతమ్ తో గొడవ పెట్టుకున్నట్టు అందరికీ అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నయనీ పావని, అవినాష్, టేస్టీ తేజ మధ్య కిచెన్ విషయం లో కాస్త సీరియస్ చర్చలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు మధ్యలో ఫ్రెండ్లీ గా గౌతమ్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో గొడవ పడకండి అని అంటాడు. అప్పుడు నయనీ పావని ‘నువ్వు మధ్యలోకి రాకు గౌతమ్..నీకు సంబంధం లేకుండా ఎందుకు దూరుతావు’ అని కోపంతో అంటుంది. అప్పుడు గౌతమ్ ‘నేను నీకు చెప్పలేదు, తేజతో చెప్తున్న..నువ్వెందుకు గొడవకి దిగిపోయావు’ అని అంటాడు. అసలు మ్యాటర్ లేకుండా గొడవ పడడం ఎందుకు అని మరోసారి అంటాడు గౌతమ్. నీకు మ్యాటర్ లేదేమో, నాకు అది పెద్ద మ్యాటర్ అని అంటుంది నయనీ పావని.

    దీనికి గౌతమ్ ట్రిగ్గర్ అయిపోతాడు. నాకు మ్యాటర్ లేదు ఏంటి?, ఏం మాట్లాడుతున్నావ్?, హలో అక్కా అంత సీన్ లేదక్కడ కూర్చో అని అంటాడు. ఇంకోసారి నన్ను అక్కా అని పిలిస్తే మర్యాదగా ఉండదు గౌతమ్ అని వార్నింగ్ ఇస్తుంది నయనీ పావని. అసలు ఏమి లేని దానికి ఇంత గొడవ పెట్టుకొని సీన్ చేస్తున్నావ్ ఎందుకు?, ఓహో నామినేషన్స్ లో ఉన్నావు, ఇలా అరిస్తే నీకు ఓట్లు పడుతాయని అనుకున్నావా ? అని అంటాడు గౌతమ్. అలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వార్ నడుస్తుంది. ఇక చివర్లో గౌతమ్ మాట్లాడుతూ ‘ఈ బిగ్ బాస్ హౌస్ లో అక్కా అని పిలవడం పెద్ద నేరం అయిపోయింది’ అని సెటైరికల్ ఎక్స్ ప్రెషన్ ఒకటి పెడుతాడు.