https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ముగిసిన ఓటింగ్..ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ అతనే..బిగ్ బాస్ హౌస్ లో మరో అన్యాయమైన ఎలిమినేషన్?

ఇవన్నీ పక్కన పెడితే ఆమె స్నేహితులైన ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వంటి వారు నామినేషన్స్ లో లేకపోవడం కూడా ఈమెకు బాగా కలిసొచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు కూడా యష్మీకే ఎక్కువ శాతం పడ్డాయి. అందుకే ఆమె దాదాపుగా 20 మార్జిన్ తో మంచి లీడ్ ని మైంటైన్ చేయగలిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 08:31 AM IST

    Bigg Boss Telugu 8(190)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంత హీట్ వాతావరణం లో జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగా చీఫ్ విష్ణుప్రియ కి 5 మందిని నామినేట్ చేసే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఆమె గౌతమ్, టేస్టీ తేజ, ప్రేరణ, నభీల్, నయనీ పావని ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రకరకాల ట్విస్టులు ఇస్తూ చివరికి గౌతమ్, యష్మీ, నయనీ పావని, హరి తేజ, టేస్టీ తేజ లను నామినేట్ అయ్యేలా చేస్తాడు. వీరిలో నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి యష్మీ భారీ మార్జిన్ ఓటింగ్ తో టాప్ 1 స్థానం లో కొనసాగుతూ వచ్చింది. దానికి తోడు ఈ వారం ఆమె టాస్కులు చాలా అద్భుతంగా ఆడడంతో పాటు, లీడర్ గా కూడా తన న్యాయకత్వ లక్షణాలను చూపించి శభాష్ అనిపించుకుంది.

    ఇవన్నీ పక్కన పెడితే ఆమె స్నేహితులైన ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వంటి వారు నామినేషన్స్ లో లేకపోవడం కూడా ఈమెకు బాగా కలిసొచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు కూడా యష్మీకే ఎక్కువ శాతం పడ్డాయి. అందుకే ఆమె దాదాపుగా 20 మార్జిన్ తో మంచి లీడ్ ని మైంటైన్ చేయగలిగింది. ఇకపోతే ఈ వారంలో ఆయన కేవలం నామినేషన్స్ నుండి సేఫ్ అవ్వడం మాత్రమే కాదు. టైటిల్ రేస్ లోకి కూడా దూసుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టైటిల్ నిఖిల్ కొడతాడా?, లేకపోతే గౌతమ్ కొడతాడా? అని మాట్లాడుకుంటున్నారు. ఇక మూడవ స్థానం లో టేస్టీ తేజ మంచి ఓటింగ్ తోనే సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో ఆయన కేవలం ఎంటర్టైన్మెంట్ లోనే కాదు, టాస్కుల విషయం లో కూడా తన వైపు నుండి నూటికి నూరు శాతం ఇచ్చి పారేస్తున్నాడు. అసలు ఆ శరీరం తో ఇతను ఇంత అద్భుతంగా టాస్కులు ఎలా ఆడగలుగుతున్నాడు అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇంకొక్క వారం బలంగా ఆడితే ఆయన టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ నయనీ పావని, హరితేజ నువ్వా నేనా అంటూ ఎలిమినేట్ అవ్వడానికి పోటీ పడుతున్నారు.

    ఎందుకంటే వీళ్లిద్దరికీ సరిసమానమైన ఓటింగ్ వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈమధ్య కాలం లో ఆడియన్స్ ఓట్లకు తగ్గట్టుగా ఎలిమినేషన్స్ జరగడం లేదు. కేవలం వాళ్లకి ఇష్టమొచ్చిన వాళ్ళను సేవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తుంది. ముఖ్యంగా కమెడియన్స్ అంటే బిగ్ బాస్ టీం కి చిన్న చూపు అయిపోయింది. టేస్టీ తేజ ఇన్ని రోజులు పడిన కష్టాన్ని నాగార్జున ఒక్కసారి కూడా గుర్తించలేదు. బాగా ఆడావు తేజా, శబాష్ అని అనిపించుకోదగ్గ ఆట అతనిది. నిఖిల్, పృథ్వీ లతో సమానంగా ఆయన గేమ్స్ ఆడాడు. కానీ తేజ అంటే వీళ్ళకి చిన్న చూపు కాబట్టి అన్యాయంగా అతన్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.