https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మెగా చీఫ్ అవ్వడం అవినాష్ కి శాపంగా మారనుందా..?వచ్చే వారం ఎలిమినేషన్!

ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు వాళ్లకి ఓట్లు వేస్తూ అలవాటు పడ్డారు. కానీ అవినాష్ తో అలాంటి కనెక్షన్ లేదు. ఇది ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం అవ్వొచ్చు. ఒకవేళ బిగ్ బాస్ టీం ఎంటర్టైన్మెంట్ కోసం అవినాష్ ఉద్దేశపూర్వకంగా సేఫ్ చేస్తే తప్ప, ఆయన వచ్చే వారం లో డేంజర్ జోన్ లో ఉన్నట్టే.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 08:26 AM IST

    Bigg Boss Telugu 8(188)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ అవ్వడం కోసం కంటెస్టెంట్స్ టాస్కులు ఏ రేంజ్ లో ఆడారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్లాన్స్ ని పూర్తిగా రద్దు చేసి బిగ్ బాస్ స్నేహితులను విడదీసి ఆడించారు. అంతకు ముందు ఓజీ క్లాన్ మొత్తం కలిసి ఆడాలి, కప్ కొడితే మనోళ్లే కొట్టాలి అంటూ చర్చించుకున్నారు. కానీ బిగ్ బాస్ ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాక్ కి గురి అయ్యారు. ఇక ఆ తర్వాత టాస్కులు మొదలయ్యాక బిగ్ బాస్ ఏ ఉద్దేశ్యంతో అయితే నాలుగు టీమ్స్ గా విభజించిందో, ఆ ఉద్దేశ్యం సఫలం అయ్యింది. స్నేహితుల మధ్య గొడవలు ఒక రేంజ్ లో జరిగాయి, కానీ మళ్ళీ ఒకటైపోయారు. ఇంత భావోద్వేగాల మధ్య, కష్టపడి ఆడి చివరికి అవినాష్ ని మెగా చీఫ్ చేశారు. అందరూ కష్టపడి ఆడారు కానీ గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, టేస్టీ తేజ కాస్త ఎక్కువ కష్టపడ్డారు.

    వీరిలో ఎవరో ఒకరు మెగా చీఫ్ అయ్యుంటే బాగుండేది అని చూసే ప్రేక్షకులకు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే అవినాష్ ‘మెగా చీఫ్’ అవ్వడం, అతనికి పెద్ద శాపం లాంటిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ గా ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు. వరుసగా నాలుగు వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్న అవినాష్, 5వ వారం లో మెగా చీఫ్ అయ్యాడు.ఆరవ వారం లో ఇప్పటి వరకు నువ్వు నామినేషన్స్ లోకి రాలేదు అనే కారణం తో కంటెస్టెంట్స్ ఇతన్ని సాఫ్ట్ టార్గెట్ చేసి నామినేట్ చేసే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అవినాష్ ఎలిమినేట్ అవ్వక తప్పదు అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ ఓటింగ్ విషయం లో జనాలకు ఒక కనెక్షన్ ఉంది.

    ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు వాళ్లకి ఓట్లు వేస్తూ అలవాటు పడ్డారు. కానీ అవినాష్ తో అలాంటి కనెక్షన్ లేదు. ఇది ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం అవ్వొచ్చు. ఒకవేళ బిగ్ బాస్ టీం ఎంటర్టైన్మెంట్ కోసం అవినాష్ ఉద్దేశపూర్వకంగా సేఫ్ చేస్తే తప్ప, ఆయన వచ్చే వారం లో డేంజర్ జోన్ లో ఉన్నట్టే. పాతాళలోకం లోకి పడిపోతున్న ఈ సీజన్ పైకి లేయడానికి అసలు కారణం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. వారిలో ముఖ్యంగా అవినాష్ వల్లే ఈ సీజన్ సేఫ్ అయ్యింది అని చెప్పొచ్చు. ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, ఆయన టాస్కులు కూడా సీరియస్ గా ఆడాడు. ప్రతీ విషయంలో ది బెస్ట్ ఇవ్వడానికి అవినాష్ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదు, మరి ఆరవ వారంలో ఏమి జరగబోతుందో చూడాలి.