ఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: కనీసం మణికంఠ AV వీడియో ని కూడా వేయకుండా బయటకి...

Bigg Boss Telugu 8: కనీసం మణికంఠ AV వీడియో ని కూడా వేయకుండా బయటకి పంపేసిన నాగార్జున..ఇంత చులకన ఎందుకు?

Bigg Boss Telugu 8: మణికంఠ అంటే బిగ్ బాస్ టీం కి అంత చులకన ఎందుకు..?, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండాల్సిన వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వలేకపోయారు ఎందుకు..?, అసలు ఏమాత్రం కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్స్ కి కూడా ఎంతో గౌరవ మర్యాదలతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపించారు. కానీ మణికంఠ ని మాత్రం అవమానించి పంపారు అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు బిగ్ బాస్ టీం పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మణికంఠ ఆరోగ్యం పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని మెడికల్ రిపోర్ట్స్ లో కూడా వచ్చింది, అతను మెంటల్ గా బాగా డౌన్ అవ్వడం వల్లే, ఇంటి నుండి బయటకి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సీజన్ లో శివాజీ కూడా ఇలా ఎన్నోసార్లు నేను బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతా, నా వల్ల అవ్వడం లేదంటూ బిగ్ బాస్ టీం ని కోరుకున్నాడు. కానీ బిగ్ బాస్ ఆయనని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ధైర్యం చెప్పాడు, నాగార్జున కూడా అతనిలో ఆత్మవిశ్వాసం ని నింపి గేమ్ ఆడేలా చేసాడు.

కానీ మణికంఠ విషయం లో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నాగార్జున నువ్వు డేంజర్ జోన్ లో లేవు, మెడికల్ రిపోర్ట్స్ కూడా బాగున్నాయి అని చెప్పాడే కానీ, అతనిలో ఆత్మ విశ్వాసం ని నింపి గేమ్ ఆడించే విధంగా అసలు ప్రయత్నం చేయలేదు. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?, మణికంఠ కంటెంట్ ఇక చాలు అనుకున్నారా?, అతని వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ పై ఏదైనా ప్రభావం పడుతుందని భావించారా? అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఎలిమినేట్ అయ్యే ప్రతీ కంటెస్టెంట్ కి , వాళ్ళ బిగ్ బాస్ జర్నీ కి సంబంధించిన AV వీడియో ని టెలికాస్ట్ చేసి పంపిస్తారు. కానీ మణికంఠ విషయం లో మాత్రం అది జరగలేదు.

ఆయన AV వీడియో వేయకుండానే బయటకి పంపేశారు. దీనికి నెటిజెన్స్ మణికంఠ అంటే బిగ్ బాస్ టీం కి చులకన అంటూ కామెంట్స్ చేసారు. కానీ అసలు కారణం అది కాదు, మణికంఠ ని ఎలిమినేట్ చేయాలనే నిర్ణయం కేవలం శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ కి మధ్యనే జరిగిందట. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి పృథ్వీ, గౌతమ్ AV వీడియోలు సిద్ధం చేసి పెట్టుకున్నారు కానీ, మణికంఠ ని ఎలిమినేట్ చేసే ఉద్దేశ్యం లేకపోవడం వల్లే ఆయన AV వీడియో ని సిద్ధం చేయలేదు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టే ఇలా జరిగిందని, ఈరోజు లేదా రేపు ఆయన AV వీడియో ని యూట్యూబ్, హాట్ స్టార్ లో అప్లోడ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కానీ అందరి కంటెస్టెంట్స్ కి దక్కిన గౌరవం మణికంఠ కి దక్కాలని, వచ్చే వారం వీకెండ్ ఎపిసోడ్ లో మణికంఠ కి సంబంధించిన AV ని టీవీ టెలికాస్ట్ లో వేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే!

Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్...

Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం 'స్పిరిట్'(Spirit Movie), 'కల్కి 2'(Kalki 2 Movie), 'Fauji' చిత్రాలను పూర్తి చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆయన...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...