https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘గంగవ్వ’ ని అనవసరంగా టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..గుప్పెడు పాలు కోసం ఇంత అతి అవసరమా?

బిగ్ బాస్ రమ్మంటేనే మేము హౌస్ లోకి వచ్చాము. మీ దగ్గర ఉన్న పాలని మీరే తాగుతున్నారు, చాక్లెట్స్ ని మీరే తింటున్నారు, ఎవరికీ పంచడం లేదు అది తప్పు కదా? అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలి, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 09:23 AM IST

    Bigg Boss Telugu 8(98)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ లో ‘గంగవ్వ’ ని ఓజీ క్లాన్ సభ్యులు చాలా సిల్లీ పాయింట్ తో టార్గెట్ చేసి నామినేట్ చేసారని చూసే ఆడియన్స్ అందరికీ అనిపించింది. ఉదయాన్నే కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు గంగవ్వ మాట్లాడుతూ ‘పాలు లేవా..?, దాచిపెట్టుకున్నారు కదా, కాస్త నాకు ఇవ్వండి, నాకు ఉదయాన్నే టీ తాగకపోతే చాలా ఇబ్బంది అవుతుంది’ అని ఓజీ క్లాన్ సభ్యులను అడుగుతుంది. ఎందుకంటే రేషన్ ని మ్యానేజ్ చేసే పవర్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది కాబట్టి. వాళ్ళు గంగవ్వకి ఇస్తారు. కానీ గంగవ్వ యష్మీ ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఓజీ క్లాన్ వాళ్లకు నచ్చలేదు. బిగ్ బాస్ ఓజీ టీంకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ లో ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశాన్ని ఇస్తాడు.

    ఆ ఇద్దరిలో ఒకరిని ఓజీ టీం గంగవ్వ ని ఎంచుకుంటుంది. అసలు ఆమె యష్మీ కి నామినేషన్ వేసిన పాయింట్ ఏమిటంటే ‘మీరు 8 మంది ఉన్నారు, మేము కూడా 8 మంది ఉన్నాం. మీరు నేను కలిసి ఒక్కటే టీం లాగా ఆడుకోవాలి, ఒక్కటే టీం లాగా కలిసి మెలిసి ఉండాలి. నిన్న మేము ఈ సమయానికి హౌస్ లోకి వచ్చాము. మేము వచ్చిన తర్వాత మీ పాటికి మీరు రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, మీ రూమ్ లోకి వచ్చినా కానీ మమల్ని పట్టించుకోలేదు. బిగ్ బాస్ రమ్మంటేనే మేము హౌస్ లోకి వచ్చాము. మీ దగ్గర ఉన్న పాలని మీరే తాగుతున్నారు, చాక్లెట్స్ ని మీరే తింటున్నారు, ఎవరికీ పంచడం లేదు అది తప్పు కదా? అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలి, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ మీకు 10 పాల ప్యాకెట్స్ ఇచ్చాడు. మాకు ఒక్కటి ఇవ్వడం లో తప్పు లేదు’ అని గంగవ్వ యష్మీ ని నామినేట్ చేస్తుంది. దీనికి యష్మీ సమాధానం చెప్తూ ‘ఫుడ్ పంచడం గురించి నిర్ణయం నేనేమి చెప్పలేను అవ్వా, అది మా చీఫ్ నిర్ణయం. మీరు నిన్న నేను మాట్లాడలేదని ఫీల్ అయ్యారు అంటున్నారు కదా, నేను ఎంత వరకు మాట్లాడగలనో అంతవరకు మాట్లాడాను, కొత్త కాబట్టి నాకు మిమ్మల్ని చూడగానే భయం వేసింది. అలాగే ఆ సమయంలో నేను బాగా అలిసిపోయి ఉన్నాను. ఈసారి నుండి అలాంటి తప్పు చేయను, మీతో కచ్చితంగా సమయం కేటాయిస్తాను’ అని అంటుంది.

    ఇక తర్వాత బిగ్ బాస్ రాయల్ క్లాన్ నుండి ఇద్దరినీ నామినేట్ చేయమని అడగగా, హౌస్ లో అందరూ చర్చించుకొని గంగవ్వ ని నామినేట్ చేస్తారు. అందుకు కారణం మెగా చీఫ్ నామినేట్ చేస్తూ ‘మేము మీకు పాలు ఇచ్చినాము అవ్వా, కానీ ఇవ్వలేదు అన్నట్టుగా మీరు చెప్పారు. అది మాకు చాలా బాధగా అనిపించింది’ అని చెప్పి నామినేట్ చేస్తాడు. గంగవ్వ ఉద్దేశ్యం నాకు ఒక్కటి కాదు, న్యాయంగా హౌస్ లో ఉన్న మిగతా వాళ్లకు కూడా సమానంగా పంచాలి, మొత్తం మీదే అన్నట్టుగా చూస్తున్నారు, అలా ఉండకూడదు, మనమంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలి అని అంటుంది. ఇంత మంచి మాటలు చెప్పినందుకు ఎవరైనా నామినేట్ చేస్తారా?, కానీ ఓజీ క్లాన్ మొత్తం గంగవ్వ ని నామినేట్ చేస్తారు. ఇది చూసే ఆడియన్స్ కి గంగవ్వ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది.