https://oktelugu.com/

Vettaiyan: వేట్టయన్ యూఎస్ఏ మూవీ రివ్యూ…

సినిమా కథ విషయానికి వస్తే వరుసగా మర్డర్లు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడమే ఈ సినిమా కథ... ఇక సింగిల్ ప్లాట్ లో కథ నడుస్తుంది. టెక్నాలజీ ని వాడుకుంటూ డ్యూటీ చేస్తున్న పోలీసుల కండ్లు కప్పి ఆ కిల్లర్ తప్పించుకుంటు ఉంటాడు. అలాంటి వాడిని రజనీకాంత్ ఎలా పట్టుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే అని యూఎస్ఏ ప్రేక్షకులు చెబుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 08:38 AM IST

    Vettaiyan

    Follow us on

    Vettaiyan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సూపర్ స్టార్ రేంజ్ ను కూడా టచ్ చేస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. 73 సంవత్సరాల వయసులో కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇప్పటికి తనకి డూప్ లేకుండా నటిస్తూ సినిమా అంటే ఎంత పిచ్చో ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన దసర కనుకగా వేట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక యూఎస్ఏ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పడ్డాయి. కాబట్టి అక్కడ ఈ సినిమా ఎలా ఉంది. ఈ సినిమాను చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు సినిమా గురించి ఏం చెబుతున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం…

    కథ

    సినిమా కథ విషయానికి వస్తే వరుసగా మర్డర్లు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడమే ఈ సినిమా కథ… ఇక సింగిల్ ప్లాట్ లో కథ నడుస్తుంది. టెక్నాలజీ ని వాడుకుంటూ డ్యూటీ చేస్తున్న పోలీసుల కండ్లు కప్పి ఆ కిల్లర్ తప్పించుకుంటు ఉంటాడు. అలాంటి వాడిని రజనీకాంత్ ఎలా పట్టుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే అని యూఎస్ఏ ప్రేక్షకులు చెబుతున్నారు.

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడు అయిన టీజీ జ్ఞానవెల్ ఇంటెన్స్ స్క్రిప్ట్ రాసుకోవడమే కాకుండా ప్రజెంటేషన్ కూడా చాలా కొత్త ఉంది అంటూ ఈ సినిమాను చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న జ్ఞానవేల్ ఈ సినిమా దర్శకుడు కావడం తో మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

    ఇక రజినీకాంత్ లాంటి స్టార్ హీరోతో ఆయన చేసిన ఈ భారీ ప్రయత్నం దాదాపు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది అంటూ యూ ఎస్ ఏ ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెలియజేయడం విశేషం… ఇక మొత్తానికైతే జ్ఞానవేల్ తన ఇంటెన్స్ తో ఈ సినిమాని థ్రిల్లర్ గా మలచడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు అంటూ ఆయన మీద ప్రశంసలైతే కురిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎమోషన్ సీన్స్ ని కూడా చాలా బాగా డీల్ చేశారని ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఎంత బాగుందో ఆయన మేకింగ్ కూడా అలాగే ఉందని రజనీకాంత్ ను చాలా అద్భుతంగా చూపించారని వారు చెబుతుండటం విశేషం…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా ప్రేక్షకులందరిచేత విజిల్స్ కూడా వేయించేలా తన క్యారెక్టరైజేషన్ ఉందని చెబుతున్నారు. ఇక అమితాబచ్చన్ నటించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ తన ధైన రీతిలో నటించి ఈ సినిమా మొత్తానికి కూడా ఒక పిల్లర్ లా నిలుచున్నాడని చెప్తున్నారు. ఇక మంజు వారియర్, ఫాహద్ ఫజిల్, రితిక సింగ్ లాంటి వారు ఇంటెన్స్ పర్ఫామెన్స్ ను ఇచ్చి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునేలా వాళ్ళ యాక్టింగ్ కూడా ఉందట… ఇక ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ లాంటి ఒక దిగ్గజ నటుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆయన యాక్టింగ్ చూడడానికైనా చాలామంది ప్రేక్షకులు ఆ సినిమాని చూస్తారు. ఇక అలాంటిది యూఎస్ఏ లో కూడా రజనీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయన కోసమే అక్కడ వాళ్ళు సినిమాను చూసి సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించిన అనిరుధ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడానికి చాలా వరకు ప్రయత్నమైతే చేశాడు. తను వాడిన ఇన్స్టు మెంట్స్ ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించేలా ఉన్నాయని ముఖ్యంగా ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది అంటూ యూఎస్ఏ ప్రేక్షకులు తెలియజేయడం విశేషం…

    ఇక ఈ సినిమా విజువల్స్ కూడా ఈ మూవీ కి చాలా వరకు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రజినీకాంత్ లాంటి ఒక స్టార్ హీరో సక్సెస్ ని సాధించాడు అంటూ యూఎస్ఏ ప్రేక్షకులు చాలా గర్వంగా చెబుతున్నారు… ఇక ఇండియాలో ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతుంది. మరి ఇక్కడ కూడా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

    ప్లస్ పాయింట్స్

    రజినీకాంత్
    డైరెక్షన్
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    కొన్ని సీన్లు బోర్ గా అనిపించడం…