Bigg Boss Telugu 8: గత బిగ్ బాస్ సీజన్ లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఎలాంటి స్ట్రాటజీ ని ఉపయోగించకుండా, స్వచ్ఛమైన గేమ్ ఆడిన కంటెస్టెంట్స్ లో ఒకరు గౌతమ్. ఈ సీజన్ లోకి అడుగుపెట్టక ముందు ఆయన ఎవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. అయినప్పటికీ కూడా 13 వారాలు హౌస్ లో కొనసాగాడు అంటే, కచ్చితంగా ఆయనలో ఉన్నటువంటి ఈ ముక్కు సూటితనం లక్షణం వల్లే అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు వచ్చిన గౌతమ్, తన పాత క్వాలిటీస్ తో పాటుగా, మైండ్ గేమ్ అనే సరికొత్త క్వాలిటీ ని కూడా జత చేసుకొని లోపలకు అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ముందుగా యష్మీ ని నామినేట్ చేస్తున్న ఆమెకు ఎన్నో పరోక్షంగా సలహాలు ఇస్తాడు గౌతమ్.
యష్మీ కూడా ఆ సలహాలను తీసుకుంటుంది, ఆ తర్వాత గౌతమ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇంకా బయట ఏమి జరుగుతుంది, ఎలా జనాల్లోకి వెళ్తుంది అనేవి అడిగి తెలుసుకుంటుంది యష్మీ. గౌతమ్ కూడా ఎంతవరకు యష్మీ కి క్లూలు ఇవ్వాలో అంత వరకు ఇచ్చేసాడు. అదే సమయంలో ఆయన మణికంఠ కి కూడా మంచి సపోర్టుగా నిలిచాడు. అతనికి కావాల్సిన సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇలా హౌస్ లో భద్ర శత్రువులుగా కొనసాగుతున్న మణికంఠ, యష్మీ లకు సమానమైన సలహాలు ఇస్తూ గౌతమ్ ఇద్దరినీ ఎదో ఒకరోజు ఇరికించే ప్లాన్ లో ఉన్నట్టు నిన్నటి ఎపిసోడ్ చూస్తే అర్థం అయ్యింది. నిన్న అవినాష్ యష్మీ ని నామినేషన్ చేసిన సమయంలో మణికంఠ టాపిక్ వస్తుంది. మణికంఠ ని ఎందుకు అలా పలు సందర్భాలలో అనాల్సి వచ్చిందో చక్కటి పాయింట్స్ తో వివరిస్తుంది యష్మీ. ఆ తర్వాత మణికంఠ మధ్యలో కలగచేసుకొని మాట్లాడుతాడు. వీళ్లిద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. ఆ సమయంలో గౌతమ్ మణికంఠ వైపు చూసి మణీ అని గట్టిగా అరవగానే మణికంఠ అర్థం చేసుకొని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి తల దించేస్తాడు.
దీనిని పృథ్వీ తన క్లాన్ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు గమనించి చెప్తాడు. అందరూ దానికి ఆశ్చర్యపోతారు, అలాగే చివర్లో వచ్చే వారం మణికంఠ ని ఎవ్వరూ నామినేట్ చేయకండి, వాడికి స్కోప్ ఇవ్వకండి అసలు అని అంటాడు. చూస్తుంటే గౌతమ్ గేమ్ ప్లాన్ మణికంఠ ని పూర్తిగా తన కంట్రోల్ లోకి పెట్టుకోవడం అని అర్థం అవుతుంది. అదే సమయంలో యష్మీ ని కూడా..శివాజీ గత సీజన్ లో పల్లవి ప్రశాంత్, యావర్ ని తన గుప్పిట్లో పెట్టుకొని ఎలా ఆడించాడో, అలా వీళ్ళిద్దరినీ ఆడించి, యష్మీ ని ఎదో ఒక సందర్భంగా పూర్తిగా బ్యాడ్ చేసి, అలాగే మణికంఠ ప్లాన్స్ మొత్తాన్ని నాశనం చేస్తూ తాను విన్నింగ్ రేస్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని నిన్న గౌతమ్ గేమ్ ప్లే చూస్తే అందరికీ అనిపించింది. మరి భవిష్యత్తులో అది ఎలా మారబోతుందో చూడాలి.