Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: 'సోలో బాయ్' అనిపించుకున్న గౌతమ్ కృష్ణ..ఒంటిచేతితో 11 మందిని ఓడించేసాడు!

Bigg Boss Telugu 8: ‘సోలో బాయ్’ అనిపించుకున్న గౌతమ్ కృష్ణ..ఒంటిచేతితో 11 మందిని ఓడించేసాడు!

స్మార్ట్ ఫోన్స్ vs స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో ఎంత కష్టపడి ఆడాడో అందరికీ తెలిసిందే. వాష్ రూమ్ లో నిఖిల్ తో జరిగిన భారీ ఫైట్ లో గౌతమ్ కి దెబ్బలు కూడా తగిలాయి. అంత పెద్ద దెబ్బలు తగిలినప్పటికీ కూడా డ్రామాలు చేయకపోవడం గౌతమ్ లో ఉన్న గొప్ప లక్షణం గా చూడొచ్చు.

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో ఆడియన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గౌతమ్ అని చెప్పొచ్చు. సీజన్ 7 లో సున్నా ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్, గ్రూప్ గేమ్స్ ఆడకుండా సోలో గా సీజన్ మొత్తం ఆడి, 13 వారాలు తన ఆట తీరుతో బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు. టాప్ 5 లోకి రావాల్సిన కంటెస్టెంట్, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. అలా సీజన్ మొత్తంపై బలమైన ప్రభావం చూపించిన గౌతమ్, గత వారం లో తన రేంజ్ స్టాండర్డ్స్ లో ఆటలు ఆడలేదు. అంతే కాదు గౌతమ్ లో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా?, ఇతను కూడా ఏడుస్తాడా అనేది ఈ సీజన్ లోనే తెలిసింది. అది జనాలకు కూడా నచ్చలేదు. అయితే ఈ వారం మాత్రం ఆయన తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి.

స్మార్ట్ ఫోన్స్ vs స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో ఎంత కష్టపడి ఆడాడో అందరికీ తెలిసిందే. వాష్ రూమ్ లో నిఖిల్ తో జరిగిన భారీ ఫైట్ లో గౌతమ్ కి దెబ్బలు కూడా తగిలాయి. అంత పెద్ద దెబ్బలు తగిలినప్పటికీ కూడా డ్రామాలు చేయకపోవడం గౌతమ్ లో ఉన్న గొప్ప లక్షణం గా చూడొచ్చు. అదే డ్రామాకంఠ అయితే ఎపిసోడ్ మొత్తం తనవైపు కు తిప్పుకునే సానుభూతి డ్రామాలు చేసేవాడు. గత సీజన్ లో కూడా ఇంతే, స్మైల్ టాస్క్ లో టేస్టీ తేజా మెడ మీద బెల్ట్ తో నాన్ స్టాప్ గా కొట్టినప్పుడు కూడా ఆయన ఎలాంటి డ్రామా చేయలేదు. ఆటలో భాగంగా తీసుకున్నాడంటే. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి జరిగిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో గౌతమ్ తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి.

ఎవరితో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోకుండా సోలోగా గేమ్ ఆడాడు. ఒక్కడే 11 మందిని ఓడించి ఇంటికి మెగా చీఫ్ గా నిలిచాడు. హౌస్ లో నిఖిల్, పృథ్వీ, నబీల్ లాంటి తోపు కంటెస్టెంట్స్ కి సరైన పోటీ గౌతమ్ అని ఈ టాస్క్ తో తేలిపోయింది. ఇదే ఊపులో ఆయన కొనసాగుతూ ముందుకు దూసుకొని పోతే, కచ్చితంగా ఆయన టైటిల్ ని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మెగా చీఫ్ అయిన వెంటనే గౌతమ్ లేడీస్ అందరికీ ఈ వారం మొత్తం ఇంటి పనుల నుండి విముక్తి కలిగించాడు. మొత్తం మగవాళ్లే పనులన్నీ చేయాలని కండిషన్ పెట్టాడు. గత సీజన్ లో కూడా ఆయన ఇలాగే చేసాడు. ఇక మినీ చీఫ్స్ గా గంగవ్వ ని, హరి తేజా ని నియమించాడు.ఈ ఒక్క సంఘటనతో గౌతమ్ ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసాడు. వచ్చే వారం లేడీస్ ఓట్లు గౌతమ్ కి ఏకపక్షంగా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper