ఎంటర్టైన్మెంట్Bigg Boss Manas: మరో నాలుగు భాషల్లోకి డబ్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ మానస్......

Bigg Boss Manas: మరో నాలుగు భాషల్లోకి డబ్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ మానస్… క్షీర సాగర మధనం మూవీ

Bigg Boss Manas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ తరుణంలోనే మానస్ నాగులపల్లి ‘బిగ్ బాస్ 5’ కు వెళ్లడం వలన అదే సమయంలో ఓటీటీ విడుదల అయిన ‘క్షీర సాగర మథనం’ సినిమాకు కలిసొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు. ప్రస్తుతం మానస్ బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 లో నిలిచాడు. దీంతో మానస్ టైటిల్ నెగ్గుతాడా… లేదా అనేది ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు అతడు హీరోగా సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ తో మానస్ కి ఫాలోయింగ్ బాగా పెరిగింది అని చెప్పాలి. ఇప్పుడు అదే క్రేజ్ ని వాడుకోవాలని క్షీర సాగర మధనం సినిమా యూనిట్ భావిస్తుంది.

Bigg Boss Manas
bigg boss fame manas ksheera sagara madhanam movie dubbing in another languages

Also Read: బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ … అతను అన్నిట్లో డ్రామా చేస్తాడంటూ
అందుకే ఈ సినిమాను త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేయాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్‌ పంగులూరి తెలిపారు. ఈ సినిమాలో మానస్ తో పాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ రావ్ కూడా హీరోగా నటించారు. అక్షతా సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ సంస్థతో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సంధర్భంగా మీడియా తో ముచ్చటించిన చిత్రా బృందం త్వరలోనే పలు భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మానస్ నాగులపల్లి ‘బిగ్ బాస్ 5’ విన్నర్ కావాలని తమ చిత్రబృందం కోరుకుంటోందని అనిల్ పంగులూరి చెప్పారు. మరోవైపు మానస్ విజేత కావాలని, అతడికి ఓట్లు వేయమని ప్రముఖ దర్శకుడు మారుతి ఓ వీడియో విడుదల చేశారు.

Also Read: బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ కానున్న కంటస్టెంట్ ఎవరంటే…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Tanya Mittal Bigg Boss : బిగ్ బాస్ బ్యూటీ చుట్టూ 150 మంది బాడీ గార్డ్స్.. ముఖ్యమంత్రికి కూడా ఈ రేంజ్ ఉండదేమో!

Tanya Mittal Bigg Boss : బిగ్ బాస్ సెలబ్రిటీలకు బయట పబ్లిక్ లో మంచి ఇమేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం మొదటి వారం బిగ్ బాస్ హౌస్...

KTR And Harish Rao In Bigg Boss: KTR , హరీష్ రావు లను ‘బిగ్ బాస్’ లోకి తీసుకోవాలని నాగార్జున కి లేఖ రాసిన కాంగ్రెస్ నేత!

KTR And Harish Rao In Bigg Boss: తెలుగు బిగ్ బాస్ క్రేజ్ ఈ సీజన్(Bigg Boss 9 Telugu) వల్ల ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది అనే...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version