Bigg Boss: బిగ్ బాస్ అనేది మన దేశానికి చెందిన రియాలిటీ షో కాదు. శిల్పా శెట్టి వల్ల ఒక్కసారిగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం స్టార్ గ్రూప్ ఈ షోను నిర్వహిస్తోంది. వాస్తవానికి బిగ్బాస్ అనేది మైండ్ గేమ్ లాంటిది. ఎటువంటి పరిచయాలు లేని వ్యక్తులు.. ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు.. కొద్దిరోజులపాటు ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది. అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ షో నిర్వహిస్తుంటారు.
మన దేశంలోని దక్షిణాది, ఉత్తరాది భాషలలో బిగ్బాస్ నిర్వహిస్తున్నారు. బిగ్బాస్ కోసం గతంలో కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ గోప్యంగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. తెలుగులో ఇటీవల అగ్నిపరీక్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ షో నడుస్తూనే ఉంది. రేటింగ్స్.. ఇతర విషయాలను పక్కన పెడితే.. ఈ షో కి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో చర్చకు దారితీస్తోంది.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. అందులో ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మగ కంటెస్టెంట్. ఆడ కంటెస్టెంట్ తో రాయడానికి వీలు కాని విధంగా వ్యవహరించాడు. మగ కంటెస్టెంట్ అలా చేస్తుండగా వారించాల్సిన ఆడ కంటెస్టెంట్ సహకరించింది. దీన్ని బట్టి చూస్తే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. వాస్తవానికి ఇటువంటి పరిణామాలు సరికాదు. కానీ నిర్వాహకులు రేటింగ్స్ కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి…
ఇది తెలుగు బిగ్ బాస్ లో జరిగింది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హిందీ బిగ్ బాస్ లోనే ఇలాంటి దారుణాలు జరిగాయని.. గతంలో కూడా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. హద్దులు దాటి ప్రవర్తించడం మంచిది కాకపోయినప్పటికీ కంటెస్టెంట్లు డబ్బుల కోసం ఆశపడి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు..
వాస్తవానికి మనదేశంలో చిత్ర పరిశ్రమ మీద సెన్సార్ ఉంటుంది . సెన్సార్ బోర్డు ఓకే చెప్తేనే ఆ సినిమా విడుదలవుతుంది. బుల్లితెర మీద కూడా సెన్సార్ కన్ను వేసి ఉంచుతుంది. ఓటీటీ పై ఎటువంటి సెన్సార్ లేదు. దీనికి తోడు బిగ్ బాస్ లాంటి షోలు సాయంత్రం తొమ్మిది తర్వాత ప్రసారం అవుతున్న నేపథ్యంలో.. వాటిపై కూడా ఎటువంటి సెన్సార్ లేదని తెలుస్తోంది. అందువల్లే ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.
మనదేశంలో బిగ్ బాస్ రియాల్టీ షోలను చాలామంది చూస్తుంటారు. హిందీ బిగ్ బాస్ షో భారీ వ్యూయర్ షిప్ ఉంటుంది. వాస్తవానికి టాస్కుల ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకోవలసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. వాటిని పక్కన పెట్టి ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలతో ఓవర్గం ప్రేక్షకులను దూరం చేసుకుంటున్నారు. ఇటువంటి వాటి వల్ల నిర్వాహకులు ఎటువంటి సందేశాలు సమాజానికి ఇస్తున్నారో వారికే తెలియాలి. అన్నట్టు కంటెస్టెంట్లు హద్దు దాటి ప్రవర్తించడం వల్ల గతంలో గర్భధారణ పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని సమాచారం.