Duvvada Srinivas – Madhuri : లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి. ఈ జంట తెలుగు ప్రజలకు సుపరిచితం కూడా. సినీ సెలబ్రిటీస్కు సమానంగా గుర్తింపు పొందింది ఈ జంట. అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్న ఈ జంట.. ఎంతో సన్నిహితంగా మెలుగుతూ.. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ లేకుంటే క్షణమైనా ఉండలేనని దివ్వెల మాధురి చెబుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ ఎడబాటును తట్టుకోలేక ఇటీవల వచ్చిన ఓ అవకాశాన్ని కూడా కోల్పోయానని చెబుతున్నారు మాధురి.
* సోషల్ మీడియా స్టార్స్ గా..
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి( Madhuri) సంబంధించి ఎటువంటి వార్త అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాధాన్యత అంశమే. దువ్వాడ శ్రీనివాస్ తన మొదటి భార్య వాణి తో పాటు పిల్లలకు దూరంగా ఉన్నారు. తన ప్రియసఖి మాధురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ జంట చేసిన రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తక్కువ సమయంలోనే ఆమె సోషల్ మీడియా స్టార్ గా ఏదిగారు. ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వెళ్లలేదు. బిగ్ బాస్ నుంచి సమాచారం, ఆహ్వానం వచ్చినా ఆమె తిరస్కరించినట్లు తాజాగా తెలిసింది. ఆమె ఎందుకు అలా చేసిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
* ఆ ఒక్క కారణంతోనే..
బిగ్ బాస్( Bigg Boss) నుంచి దివ్వెల మాధురికి ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని ఆమె చెప్పారు. ఓ ముఖ్యమైన కారణం వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు. నా రాజా నువ్వు వదిలి నేను ఉండలేను.. అందుకే బిగ్ బాస్ అవకాశం వచ్చిన వదులుకున్నా అంటూ ఆమె భావోద్వేగానికి గురవుతూ చెప్పారు. ప్రతిరోజు ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి వరకు తన రాజా తోనే సమయం గడుపుతానని.. ఆయన అన్ని పనులు చూసుకోవడం తనకు ఇష్టమని.. ఎక్కువగా ఆయనతో ప్రయాణం మరి ఇష్టమని చెప్పుకొచ్చారు దివ్వెల మాధురి. అంతలా వారి మధ్య బంధం ముదిరిపోయింది.
