KTR And Harish Rao In Bigg Boss: తెలుగు బిగ్ బాస్ క్రేజ్ ఈ సీజన్(Bigg Boss 9 Telugu) వల్ల ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏ సీజన్ కి లేని విధంగా, ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ఫలితంగా టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఈ సీజన్ ని కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ కూడా చాలా గట్టిగా అనుసరిస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఈ రియాలిటీ షో కి అతి పెద్ద ఫ్యాన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే సమయం లో చెప్పుకొచ్చాడు. అలా ఇండస్ట్రీ లో ఎంతో మంది ఈ సీజన్ కి ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక రాజకీయ నాయకుల్లో కూడా ఈ రియాలిటీ షో పై క్రేజ్ వేరే లెవెల్ లో ఉందాం నేడే తెలిసింది. గత రెండు మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్ లో జరుగుతుందో మనమంతా చూసాము. సీఎం రేవంత్ రెడ్డి కాస్త నోరు జారీ మాట్లాడడం సోషల్ మీడియా లో కాంట్రవర్సీ గా మారింది. అదే విధంగా సీఎం రేవంత్ కి కౌంటర్ ఇస్తూ నేడు KTR చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇలా పరస్పరం మాటల యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ నేత , ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్ట సాయికుమార్ హోస్ట్ నాగార్జున కు లేఖ రాసాడు. రాజకీయ నటులుగా KTR , హరీష్ రావు జీవిస్తున్నారని, అబద్దాలు ఆడి మోసం చేయడం లో వీళ్లకు సాటి ఎవ్వరూ లేరని, వీళ్ళిద్దరిని వచ్చే బిగ్ బాస్ సీజన్ కి తీసుకుంటే TRP రేటింగ్స్ బ్లాస్ట్ అవుతాయని , మా తెలంగాణ ప్రజలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. మరి నాగార్జున నుండి రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి.