Bigg Boss Karnataka State: మన తెలుగు లోనే కాదు, ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది ఒకే సమయం లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుంటాయి. రీసెంట్ గానే సెప్టెంబర్ 28 న, కన్నడ బిగ్ బాస్ మొదలైంది. కిచ్చ సుదీప్ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో కి ఇప్పుడు చుక్కెదురు అయ్యింది. బిగ్ బాస్ షూటింగ్ ని తక్షణమే ఆపేయాలి అంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్ సెట్స్ బెంగళూరు సమీపంలోని బడడి హుబ్లీ లోని జాలీవూడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్ లో వేశారు. అన్ని సీజన్స్ కి సంబంధించిన షూటింగ్స్ ఇక్కడే జరిగాయి.
అయితే కర్ణాటక కాలుష్య బోర్డు అందించిన నోటీసు ప్రకారం చూస్తే, బిగ్ బాస్ హౌస్ నుండి శుద్ధి చెయ్యని మరుగు నీటిని బయటకు నేరుగా వదిలేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనివల్ల పర్యవరం కాలుష్యం ఏర్పడుతుందని, బిగ్ బాస్ సెట్ దగ్గర్లో 250 KLD సామర్థ్యం గల మరుగునీటి శుద్ధి కర్మాగారం ని ఏర్పాటు చేశారు కానీ, అందులో సరైన అంతర్గత డ్రైనేజి కనెక్షన్స్ లేవని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని , పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, మరియు ఇతర వ్యర్థ పదార్థాలు అన్నీ బహిరంగంగానే విసిరివేస్తున్నారని, వీటికి తోడు అదనంగా 625 KV , 500 KVA సామర్థ్యం గల రెండు డీజల్ జెనెరేటర్లు అక్కడ ఏర్పాటు చేశారని, దాని వాళ్ళ కాలుష్యం మరింత దెబ్బ తింటుందని అంటున్నారు. ఈ కారణాల చేతనే తక్షణమే బిగ్ బాస్ షో ని ఆపేయాలి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతే కాకుండా విద్యుత్ శాఖకు వెంటనే బిగ్ బాస్ సెట్ కి కరెంటు ని నిలిపివేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఈ షో మనుగడ అనుమానం గా ఉంది. సోషల్ మీడియా లో తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ఆరంభం లోనే ఆసక్తికరమైన టాస్కులతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్న బిగ్ బాస్ షో, ఇప్పుడు సడన్ గా అయిపోతే కోట్లలో నష్టం వాటిల్లుతుంది. మరి బిగ్ బాస్ యామాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది?, హై కోర్టు మెట్లు ఎక్కుతుందా? , లేదా ప్రభుత్వం ఆదేశానుసారం షో ని నిలిపివేస్తారా అనేది తెలియాల్సి ఉంది.