https://oktelugu.com/

Bigg Boss Manas: మరో నాలుగు భాషల్లోకి డబ్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ మానస్… క్షీర సాగర మధనం మూవీ

Bigg Boss Manas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ తరుణంలోనే మానస్ నాగులపల్లి ‘బిగ్ బాస్ 5’ కు వెళ్లడం వలన అదే సమయంలో ఓటీటీ విడుదల అయిన ‘క్షీర సాగర మథనం’ సినిమాకు కలిసొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు. ప్రస్తుతం మానస్ బిగ్ బాస్ సీజన్ 5 లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 09:07 AM IST
    Follow us on

    Bigg Boss Manas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ తరుణంలోనే మానస్ నాగులపల్లి ‘బిగ్ బాస్ 5’ కు వెళ్లడం వలన అదే సమయంలో ఓటీటీ విడుదల అయిన ‘క్షీర సాగర మథనం’ సినిమాకు కలిసొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు. ప్రస్తుతం మానస్ బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 లో నిలిచాడు. దీంతో మానస్ టైటిల్ నెగ్గుతాడా… లేదా అనేది ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు అతడు హీరోగా సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ తో మానస్ కి ఫాలోయింగ్ బాగా పెరిగింది అని చెప్పాలి. ఇప్పుడు అదే క్రేజ్ ని వాడుకోవాలని క్షీర సాగర మధనం సినిమా యూనిట్ భావిస్తుంది.

    bigg boss fame manas ksheera sagara madhanam movie dubbing in another languages

    Also Read: బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ … అతను అన్నిట్లో డ్రామా చేస్తాడంటూ
    అందుకే ఈ సినిమాను త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేయాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్‌ పంగులూరి తెలిపారు. ఈ సినిమాలో మానస్ తో పాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ రావ్ కూడా హీరోగా నటించారు. అక్షతా సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ సంస్థతో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సంధర్భంగా మీడియా తో ముచ్చటించిన చిత్రా బృందం త్వరలోనే పలు భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మానస్ నాగులపల్లి ‘బిగ్ బాస్ 5’ విన్నర్ కావాలని తమ చిత్రబృందం కోరుకుంటోందని అనిల్ పంగులూరి చెప్పారు. మరోవైపు మానస్ విజేత కావాలని, అతడికి ఓట్లు వేయమని ప్రముఖ దర్శకుడు మారుతి ఓ వీడియో విడుదల చేశారు.

    Also Read: బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ కానున్న కంటస్టెంట్ ఎవరంటే…