Bigg Boss 9 Telugu Demon Pawan: ఈరోజు కాసేపటి క్రితమే మొదలైన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నారు గా. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కో రకంగా ఉన్నారు. వీళ్లందరినీ చూస్తుంటే ఈసారి సీజన్ చాలా పెద్ద హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరు బోలెడంత కంటెంట్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే అగ్నిపరీక్ష షో ద్వారా ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్ కాసేపటి క్రితమే అడుగు పెట్టాడు. అతను మరెవరో కాదు, డిమోన్ పవన్. ఇతను అగ్ని పరీక్ష షో పెద్దగా పెర్ఫర్మ్ చేసింది ఏమి లేదు. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు కానీ, కేవలం ఒకే ఒక్క టాస్కుని మాత్రమే గెలిచాడు. వాదనలు జరిగాయినప్పుడు కూడా బలంగా తన పాయింట్స్ ని పెట్టినట్టు 15 ఎపిసోడ్స్ లో ఎప్పుడూ అనిపించలేదు. ఇలాంటి కంటెస్టెంట్ ని లోపలకు ఎలా పంపారు, పైగా జనాల ఓటింగ్ ద్వారా వెళ్లాడని అంటున్నారు. ఇతనికి ఓట్లు వేసింది ఎవరు?.
సోషల్ మీడియా లో జరిగిన అన్ని పొలింగ్స్ లోనూ ఇతనికి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. ఇతనికి బదులుగా నాగ ప్రశాంత్ లేదా ప్రియా వెళ్తారని అనుకున్నారు. ప్రియా హౌస్ లోకి వెళ్ళింది అనే టాక్ కూడా వచ్చింది. కానీ డిమాన్ పవన్ ఎలా వెళ్ళాడో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ప్రియా స్థానాన్ని కబ్జా చేసి బిగ్ బాస్ యాజమాన్యం ఇతన్ని రికమెండ్ చేసి పంపినట్టు గా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు. చాలా కాంట్రవర్షియల్ గా అనిపిస్తున్న డిమాం పవన్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అయినా తన మార్కుని చూపిస్తాడో లేదో చూడాలి.