Deepthi Sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. అమ్మడు గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. దీప్తి తెగింపుకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. కాగా దీప్తి కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు దీప్తికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ షో దీప్తికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో పాటు అనేక యూట్యూబ్ వీడియోలు చేశారు దీప్తి. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. షణ్ముఖ్ నా లవర్ అని దీప్తి పబ్లిక్ గా చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ గెలవాలని బయట క్యాంపైన్ కూడా చేసింది. అదే క్రమంలో వీరి ప్రేమలో చిచ్చు రగిలింది.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంటిలో పండగ… పెళ్లి కాకుండానే తండ్రి హోదా!
హౌస్ లో లేడీ కంటెస్టెంట్ సిరితో షణ్ముఖ్ చాలా సన్నిహితంగా మెలిగాడు. వీరిద్దరి రొమాన్స్ హద్దులు దాటిపోయింది. ఓ ప్రక్క స్నేహితులమంటూనే ముద్దులు, హగ్గులతో రచ్చ చేశారు. తరచుగా షణ్ముఖ్-సిరి మధ్య గొడవలు, అలకలు చోటు చేసుకునేవి. ఎంత తిట్టుకున్నా కాసేపటికి ఇద్దరూ ఒకటైపోయేవారు. వీరిద్దరి ఎమోషనల్ లవ్ డ్రామా ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

ఇదంతా బయటి నుండి గమనిస్తున్న దీప్తి మదిలో అనుమానపు బీజాలు పడ్డాయి. షో ముగిసిన రోజుల వ్యవధిలో షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఇకపై నా ఫోకస్ కెరీర్ పైనే, ఎమోషనల్ బాండింగ్స్ పెట్టుకోనని చెప్పుకొచ్చారు. షణ్ముఖ్-దీప్తి విడిపోయినా… వాళ్ళ మధ్య మెంటల్ వార్ నడుస్తుంది. పరోక్షంగా సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకుంటున్నారు.
వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరూ తిరిగి కలిసిపోవాలని ఆశపడుతున్నారు. ఈ బ్రేకప్ వాళ్లకు నష్టమే చేసినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ రీత్యా మరిన్ని షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ లు తెరకెక్కే అవకాశం ఉండేది. వాటి ద్వారా షణ్ముఖ్, దీప్తి బాగా సంపాదించేవారు. వ్యక్తిగత కారణాలతో విడిపోయి వృత్తిపరంగా కోల్పోతున్నారు.

మరోవైపు దీప్తి సునైన అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తుంది. తాజా ఫోటో షూట్ లో దీప్తి హాట్ హాట్ గా దర్శనమిచ్చింది. దీప్తి లేటెస్ట్ ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. దీప్తి తనలోని గ్లామర్ యాంగిల్ బయటకు తీస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ఆలోచనలో ఉంది.
Also Read:Sneha Ullal: స్నేహ ఉల్లాల్ నటనకు ఎందుకు దూరమైందో తెలుసా?
Recommended Videos



[…] Also Read: Deepthi Sunaina: హద్దులు దాటేసిన బిగ్ బాస్ ఫేమ్ … […]
[…] Also Read:Deepthi Sunaina: హద్దులు దాటేసిన బిగ్ బాస్ ఫేమ్ … […]