Bigg Boss Ariyana: బిగ్ బాస్ సీజన్ 4లో అరియానా గ్లోరీ ఓ సంచలనం. బోల్డ్ యాటిట్యూడ్, ఫైరింగ్ గేమ్ తో ఫైనల్ కి దూసుకెళ్లిన ఈ భామ, 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ అవుతుందని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం గేమ్ తో అభిమానులను సంపాదించి అరియానా ఫైనల్ లో పోటీ పడడం విశేషం. ఈ సీజన్ గెస్ట్ హోస్ట్ గా వచ్చిన సమంత సైతం… అరియానాలో తనను చూసుకుంటున్నట్లు చెప్పి, మిగతా కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చింది.

బిగ్ బాస్ షో అరియానా కెరీర్ కి బాగానే ఉపయోగపడింది. షో ద్వారా వచ్చి ఫేమ్ ఆమెను యాంకర్ గా, నటిగా బిజీ చేసింది. లేటెస్ట్ సీజన్ బిగ్ బాస్ బజ్ యాంకర్ గా కూడా అరియానా ఛాన్స్ కొట్టేశారు. షో నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ… వాళ్ళ మనోభావాలు బయటికి లాగుతున్నారు. ఇక ఆ మధ్య వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొంది అరియానా. ఈ ఇంటర్వ్యూలో అరియానా అంగాగాన్ని వర్ణిస్తూ, వర్మ పచ్చి కామెంట్స్ చేశాడు. అరియనా సైతం జిమ్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది.
కాగా వెండితెరపై కూడా అరియానా ఈ తరహా రోల్స్ లో రచ్చ చేస్తున్నారు. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా.. ట్రైలర్ విడుదల కాగా.. అరియానా హాట్ సీన్ లో కనిపించి షాక్ ఇచ్చింది. పల్లెటూరు ప్లే బాయ్ రోల్ లో కనిపిస్తున్న రాజ్ తరుణ్ , అరియానా నడుముపై చేయివేసి, హాట్ డైలాగ్ చెప్పాడు. దీనితో అనుభవించు రాజా సినిమాలో అరియానా రోల్ కొంచెం పచ్చిగా ఉండే ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మూవీ విడుదల కావాలి. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 26న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: హౌస్ లో దుమారం లేపుతున్న షన్ను, సిరి ల డీప్ కనెక్షన్