Kodali Nani:అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించేలా మాట్లాడారని శాసనసభను బాయ్ కాట్ చేసిన వచ్చిన చంద్రబాబు విలేకరుల సమావేశంలో భోరుమన్నాడు. గుక్కపట్టి ఏడ్చాడు. ఇంతటి దారుణమైన రాజకీయాలు చూడలేదని.. బూతులు తిడుతున్నారని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.

అయితే చంద్రబాబు ఇలా చేస్తాడని మాకు ముందు తెలుసు అని.. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తాడని నిన్న సాయంత్రమే స్కెచ్ గీసుకున్నాడని.. ఇదంతా పక్క ప్రణాళిక ప్రకారం చేశాడని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశాడు. ఏపీలో ఇక ఎన్నికల్లో గెలవలేమని తెలిసి.. వైసీపీని, జగన్ ను ఎదుర్కోలేక ఆయనపై అభాండాలు వేసేందుకు చంద్రబాబు నిన్న సాయంత్రం నుంచి స్కెచ్ వేసుకొని శాసనసభను బాయ్ కాట్ చేశాడని నాని ఆరోపించారు. ఈ ప్లాన్ నిన్న సాయంత్రమే తమకు తెలుసన్నారు.
తనను, తన భార్యను తిట్టారని మీడియా ముందు ఏడ్వాలని చంద్రబాబు నిన్ననే డిసైడ్ అయ్యాడని.. గ్లిజరిన్ రాసుకొని మరీ మీడియా ముందు ఏడ్చాడని మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. సరిగా రాసుకొని ఉండలేదు కాబట్టే కన్నీళ్లు రాలేదని ఎద్దేవా చేశారు. జగన్ ను ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించలేక ప్రజల్లో సింపతీ కోసం ఇలా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని కొడాలి నాని ఆరోపించారు. గతీ ఏతీ లేక.. జగన్ ను ఏమీ చేయలేక.. తన భార్య గురించి మాట్లాడుతున్నారని కళ్ల వెంట నీళ్లు పెట్టుకొని ఏడిస్తే జనాలు ఓట్లేసి సీఎంను చేస్తారని ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే ఒక చిన్న ఆశ అని.. చంద్రబాబు ఇది తప్ప వేరే ప్లాన్ లేదని.. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చంద్రబాబు చేసి ఏడ్చాడని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెట్టాలని చంద్రబాబు నిన్ననే డిసైడ్ అయ్యాడని కొడాలి నాని ఆరోపించారు.
మాధవరెడ్డి, వంగవీటి మోహనరంగ, వైఎస్ వివేకా నందారెడ్డి హత్యల గురించి మాట్లాడుదామని.. వీళ్ల హత్యలన్నీ బాబు హయాంలోనే జరిగాయని వీటిపై విచారణ చేద్దామంటేనే చంద్రబాబు ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడని కొడాలి నాని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారి లాగా చంద్రబాబు వ్యవహరిస్తాడని మండిపడ్డారు. అందుకే ఈ ఏడుపుల స్కెచ్ వేశాడని కొడాలి నాని నిప్పులు చెరిగారు.
కొడాలి నాని వీడియో