Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ ను అవమానించిన బిగ్ బాస్ నటి

Allu Arjun: అల్లు అర్జున్ ను అవమానించిన బిగ్ బాస్ నటి

రీసెంట్ గానే నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ని బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ చాలా దారుణంగా అవమానించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె స్టార్ హీరోయిన్ కాదు.

Allu Arjun: తెలిసితెలియక మాట్లాడే మాటలు కొన్ని సార్లు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. అభిమానులు హట్ చేస్తాయి. అందుకే సెలబ్రెటీలు ఎప్పుడు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొందరు మాత్రం వారు ఫేమస్ అవ్వాలని, లేదా మరో రీజన్ తో అయినా కూడా స్టార్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కొన్ని సార్లు ఫన్నీగా మాట్లాడిన అభిమానులకు ఆగ్రహం వస్తుంటుంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ నటి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు ఏం మాట్లాడింది అనే వివరాలు మీకోసం…

రీసెంట్ గానే నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ని బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ చాలా దారుణంగా అవమానించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె స్టార్ హీరోయిన్ కాదు. మామూలు ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసినా.. అవి పెద్దగా హిట్ అవలేదు. అలాంటిది బన్నీని అనేంత ధైర్యమా అని అల్లు అర్జున్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ హౌజ్ లోకి ఎంట్రీ కంటే ముందే అశ్విని బన్నీని అవమానిస్తూ మాట్లాడింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక కి అక్క పాత్రలో చేసింది ఈ అమ్మడు. అంతేకాదు అశ్విని శ్రీ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ సక్సెస్ కాకపోవడంతో ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్ట్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో కొనసాగుతుంది. ఇక బిగ్ బాస్ కంటే ముందు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు స్టార్ హీరోల సినిమాల్లో వారి పక్కన ఐటెం సాంగ్స్ చేయాలనే ఒక కోరిక ఉండేదని..కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అంటూ చెప్పింది. తన హైట్ కి ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని…కానీ అల్లు అర్జున్ తన పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకొని చేయాల్సి వస్తుంది అంటూ తీవ్రంగా అవమానించింది.

నేషనల్ అవార్డు విన్నర్ ని, ఐకాన్ స్టార్ పై గౌరవం లేకుండా ఇలా మాట్లాడడం ఏంటి అంటూ తిట్టిపోస్తున్నారు అభిమానులు. అంతే కాదు సరదాగా మాట్లాడినా ఎలా మాట్లాడినా బన్నీకి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మాటలకు ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగుతున్నందువల్ల బయటకు వచ్చిన తర్వాతనే ఈమె స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఆమె రియాక్షన్ కోసం వేచి చూడాల్సిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper