Bigg Boss 9 Telugu Winner: తెలుగు బిగ్ బాస్ చరిత్ర లో సీజన్ 4 తర్వాత, అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకున్న సీజన్ గా ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ని చెప్పుకోవచ్చు. ఏ సీజన్ అయినా గొడవల కారణం గా హిట్స్ అవుతుంటాయి అని మనం నమ్ముతూ ఉంటాము. కానీ ఈ సీజన్ మాత్రం బంధాలు, అనుబంధాలు మధ్యనే సాగింది. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది అని చెప్పొచ్చు. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన కంటెస్టెంట్స్ సంజన, ఇమ్మానుయేల్, తనూజ, భరణి. షో మొత్తం ఈ నలుగురు చుట్టూనే తిరిగింది. ముఖ్యంగా భరణి పెట్టుకున్న బంధాల వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ కి కనెక్ట్ అయ్యారు. అయితే నిన్న భరణి ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ గా తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ మరియు సంజన నిలిచారు.
వీరిలో టైటిల్ రేస్ లో ఉన్నది కేవలం తనూజ, పవన్ కళ్యాణ్ మాత్రమే. వీళ్లిద్దరి మధ్య పోటీ మామూలు రేంజ్ లో లేదు. కేవలం రెండు మూడు శాతం మాత్రమే ఈ ఇద్దరి మధ్య తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రాము రాథోడ్ ఎలిమినేషన్ తర్వాత నుండి ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. మొదటి నాలుగు వారాల్లో అసలు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడియన్స్ కి కనిపించలేదు. ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిన రోజు ఆమెతో పాటు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే తాను డేంజర్ జోన్ లో ఉన్నాను అనే విషయం గ్రహించాడో, అప్పటి నుండి తన ఆట ని మార్చుకున్నాడు. మరుసటి వారం ఇమ్మానుయేల్ తో కలిసి గేమ్స్ ఆడడం పవన్ కళ్యాణ్ కి బాగా కలిసొచ్చింది.
ఒక టాస్క్ లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు వెన్నుపోటు పొడిచారు అనే సానుభూతి పవన్ కళ్యాణ్ కి బాగా వర్కౌట్ అయ్యింది. అక్కడి నుండి డేంజర్ జోన్ లో ఉన్న వ్యక్తి రెండవ స్థానానికి ఎగబాకాడు. రెండవ స్థానానికి అయితే రాగలిగాడు కానీ, తనూజ ఓటింగ్ కి దరిదాపుల్లో కూడా లేని పరిస్థితే ఇతనికి ఉండేది. అంటే తనూజ కి 57 శాతం ఓటింగ్ ఉంటే, పవన్ కళ్యాణ్ కి కేవలం 23 శాతం ఓటింగ్ మాత్రమే ఉండేది. కానీ ఫ్యామిలీ వీక్ కి ముందు వారం, ఆయన తన కుటుంబం గిరించి చెప్పుకోవడం, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ని తనూజ ని మించిపోయేలా చేసింది. ఆయన తల్లిదండ్రులు మాట్లాడిన మాటలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ వారం తర్వాత వరుసగా రెండు వారాలు పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి.
దీంతో ఒక్కసారిగా ఆయన తనూజ ఓటింగ్ ని దాటేసే పరిస్థితి వచింది. కానీ గత రెండు వారాల నుండి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. నామినేషన్స్ లో లేకపోవడం, మరోపక్క గత రెండు వారాలు గేమ్ మొత్తం తనూజ, సంజన మధ్య తిరగడంతో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కాస్త తగ్గింది. ప్రస్తుతానికి అయితే ఆయన రెండవ స్థానం లోనే ఉన్నాడు. కానీ ఎక్కువ తేడా లేదు. తనూజ కి గత రెండు వారాలు మంచి పాజిటివ్ ఎపిసోడ్స్ పడడంతో ఆమె నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. పైగా సీరియల్ ఆడియన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు, సెలబ్రిటీలు కూడా తనూజ కి ఓట్లు వేయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే కచ్చితంగా టైటిల్ ని గెలుచుకునే అవకాశాలు ఉంటాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.