Bigg Boss telugu 8 winner Nikhil new house: టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నిఖిల్ , బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే . బిగ్ బాస్ షో ద్వారా అత్యధిక క్రేజ్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు నిఖిల్ . ఈయనకు హౌస్ లో ఉన్నప్పుడు ఎదురైనన్ని తీవ్రమైన పరిణామాలు , ఇప్పటి వరకు ఏ సీజన్ కంటెస్టెంట్ కి కూడా ఎదురు అవ్వలేదు. ఎన్నడూ లేని విధంగా తెలుగు వెర్సస్ కన్నడ అనే సెంటిమెంట్ ని కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ నిఖిల్ ఆట తీరుని మెచ్చిన జనాలు , ఆయన కన్నడ వాడు అయ్యినప్పటికీ కూడా టైటిల్ విన్ అయ్యేలా చేశారు మన తెలుగు ఆడియన్స్. ఇప్పటికీ నిఖిల్ కి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ అలాగే ఉంది .
Also Read: విజయ్ దేవరకొండ , రష్మిక రిసెప్షన్ కి ఆంధ్రా రాజకీయ నాయకులకు దక్కని ఆహ్వానం..కారణం ఏంటంటే!
ఇదంతా పక్కన పెడితే హౌస్ లో ఉన్నప్పుడు ఆయన్ని ఒక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఒక ప్రశ్న అడుగుతూ ‘నువ్వు ఒకవేళ ప్రైజ్ మనీ ని గెలుచుకుంటే, దానిని ఏమి చేస్తావు అని ప్రశ్న అడగ్గా, అందుకు నిఖిల్ సమాధానం చెప్తూ ఉన్న అప్పులు తీర్చుకొని , నా తల్లిదండ్రుల పేర్ల మీద ఒక ఇల్లు కట్టించాలి అనే తన కోరికను బయట పెట్టాడు. ఎట్టకేలకు నిన్న ఆయన నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి తన తల్లిదండ్రులతో కలిసి గృహ ప్రవేశం చేసాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూసేయండి. ఈ ఫోటోలలో నిఖిల్ , సోదరుడు దిశాంక్ లతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు.