Akhanda 2 three days collections: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ బోయపాటి శ్రీను తో బాలయ్య చేస్తున్న నాల్గవ సినిమా కావడం తో ఈ చిత్రం పై ఆడియన్స్ లో అంచనాలు, క్రేజ్ భారీ గా ఉండడం వల్ల ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత రెండవ రోజు, మూడవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. అలా మూడు రోజుల థియేట్రికల్ రన్ లో దాదాపుగా 50 శాతం రీకవరీ రేట్ ని సంపాదించింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందనే నమ్మకం ఎవ్వరిలోనూ లేదు.
మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రం మూడు రోజుల్లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ సినిమా మరో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఈ సినిమాని ఈ ప్రాంతం లో పంపిణి చేసిన దిల్ రాజు మాత్రం 70 రీకవరీ అయ్యిందని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని కలెక్షన్స్ ని చూసి చెప్పేయొచ్చు. ఇక బాలయ్య కి కంచుకోటగా పిలవబడే సీడెడ్ లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సీడెడ్ లో పాతిక కోట్ల రూపాయలకు పైగా జరిగింది.
ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మరో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర నుండి 4 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, గుంటూరు నుండి 4 కోట్ల 70 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 3 కోట్ల 45 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 40 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 3 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమాకు 50 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 53 కోట్లు రావాలి. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.