Nellore YCP: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు వేరు. అక్కడ చాలా అడ్వాన్స్ గా ఉంటాయి రాజకీయాలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కొత్త కొత్త నాయకత్వాలు దూసుకొచ్చాయి. పాత, కొత్త నేతల కలయిక జరిగింది. ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. పార్టీలో చిత్తశుద్ధితో కృషి చేసిన వారికి కాకుండా.. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఆపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దూకుడుతో చాలామంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ఏకపక్షంగా మద్దతు తెలిపింది. మొన్నటి ఎన్నికల్లో మాత్రం టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపంతోనే. అయితే ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవి సైతం టిడిపి దక్కించుకునేలా ఉంది. దీంతో ఆ పార్టీకి సంపూర్ణ విజయం దక్కినట్లు అయింది.
వైసిపి పూర్తిగా ఖాళీ..
గత ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాకు( Nellore district) చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిపోయారు. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ పాల్పడ్డారని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే తర్వాత వారు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారువైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. నెల్లూరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చాక వైసీపీ శ్రేణులు భారీగా టిడిపిలో చేరాయి. ఈ క్రమంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 42 మంది కార్పొరేటర్లు టిడిపిలోకి వెళ్లారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ సైతం ఆ పార్టీలో చేరిపోయారు.
మేయర్ రాజీనామా..
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి మేయర్గా ఎంపికైన స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ను మేయర్ గా ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 18న మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి కొంతమంది కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటికే 42 మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరిపోయారు. మరోవైపు మేయర్ స్రవంతి భర్త పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంతో తాను మేయర్ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని స్రవంతికి తెలుసు. అందుకే ఆమె ముందు గానే తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 18న అవిశ్వాస తీర్మానం ఉంది. ఇంతలోనే మేయర్ రాజీనామా చేయడంతో డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఆయనను మేయర్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పుడు కార్పొరేటర్ల మద్దతుతో పూర్తిస్థాయిలో మేయర్ పదవిని ఆయన చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టిడిపి కార్పొరేటర్లు అంతా గోవా ట్రిప్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.