Bigg Boss 9 Telugu Suman Shetty: బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఎక్కువ రోజులు కొనసాగాలంటే, కచ్చితంగా గేమ్ బాగుండాలి, అతని క్యారక్టర్ జనాలకు నచ్చాలి, తెలివైన అడుగులు వేస్తూ ఉండాలి, వీటి అన్నిటితో పాటు తన సొంత కాళ్ళ మీద నిలబడేలా ఉండాలి. కానీ ఇవేమి లేకపోయినా ఒక కంటెస్టెంట్ 13 వారాలు కొనసాగడమే కాకుండా, 14 వారం కి కూడా క్వాలిఫై అవ్వొచ్చు అని సుమన్ శెట్టి ని చూసిన తర్వాతే అర్థం అయ్యింది. కామెడీ ఏమిటంటే ఇతన్ని సేవ్ చేయడం కోసం టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేయడమే. నేటి ఎపిసోడ్ లో మీరు ఇది చూడొచ్చు. ఈ సంఘటన తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
వాస్తవానికి సుమన్ శెట్టి కి హౌస్ లో కనీసం రెండు వారాలు ఉండేందుకు కూడా అర్హత లేదు. ఇతనికంటే ఫ్లోరా షైనీ వంద రేట్లు బెటర్ కంటెస్టెంట్. తన గేమ్ తానూ ఆదుకోగలదు. కానీ సుమన్ శెట్టి కి నామినేషన్ పాయింట్స్ కూడా భరణి లాంటోళ్ళు ఇవ్వాలి. ఇంతటి పనికిమాలిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ చూసి ఉండము కూడా. గత వారం ఇతను పెట్టిన నామినేషన్స్ పాయింట్స్ ని చూస్తే LKG పిల్లవాడు కూడా నవ్వుతాడు. అంతటి తెలివైన కంటెస్టెంట్. కచ్చితంగా సుమన్ శెట్టి ఒక మంచి మనసున్న మనిషి, అమాయకుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బిగ్ బాస్ షో ఫార్మటు కి అసలు ఏ మాత్రం సరిపోని కంటెస్టెంట్ ఆయన. ఎదో రెండు వారాలు ఉండి వెళ్ళిపోతాడని అనుకుంటే, 13 వారాలు ఆయన కొనసాగడం విడ్డూరమే.
వాస్తవానికి ఈ వారం అతి తక్కువ ఓట్లు ఆయనకే వచ్చాయి. శనివారం ఉదయం బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ కి ప్రశ్నలు కూడా రెడీ అయిపోయాయి, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడంటూ అప్డేట్ సోషల్ మీడియా లో కూడా లీక్ అయిపోయింది. అబ్బా కనీసం ఇప్పుడైనా ఎలిమినేట్ అయ్యాడు, వచ్చే వారం ఈ మహానుభావుడి నామినేషన్స్ పాయింట్స్ వైన్ అదృష్టం తప్పింది అని సంతోషించారు నెటిజెన్స్. కానీ ఈ అప్డేట్ వచ్చిన కాసేపటికి రీతూ చౌదరి ఎలిమినేట్ అంటూ మరో స్పష్టమైన అప్డేట్ వచ్చింది. ఆమెకు కూడా తక్కువ ఓటింగ్ నమోదు అయింది. కానీ సుమన్ శెట్టి కంటే ఒక అడుగు ముందు ఉంది. అయినప్పటికీ రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేయడానికి కారణం, సుమన్ శెట్టి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అనే గౌరవం తోనా?, లేదంటే భరణి తో అతని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం, గత రెండు వారాల నుండి సోషల్ మీడియా లో వీళ్లిద్దరి మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి కాబట్టి, వచ్చే చివరి రెండు వారాల్లో కూడా వర్కౌట్ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యం తో ఉంచారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.