Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకోవడం తో , ‘బిగ్ బాస్ 10’ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇలాంటి అంచనాలు గతం లో ఏ బిగ్ బాస్ సీజన్ మీద కూడా లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే టీం కంటెస్టెంట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీల విషయం లో అసలు వెనక్కి తగ్గడం లేదు. ఎన్ని కోట్లు అయినా సరే , ఈ టాప్ సెలబ్రిటీలను తీసుకొని రావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ టీం 5 మంది హీరోయిన్స్ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ 5 మందిలో ముగ్గురు కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది తేజస్విని గౌడ గురించి. ఈమె టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా బాగా పాపులర్ , పైగా అమర్ దీప్ వంటి బుల్లితెర స్టార్ కి సతీమణి, కాబట్టి ఈమెకు క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. అందుకే బిగ్ బాస్ టీం గత రెండు సీజన్స్ నుండి ఈమెని సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయం లో చర్చలు విఫలం అవ్వడం తో ఆమె రాలేకపోయింది. కానీ ఈసారి ఈమెని ఎలా అయినా తీసుకొని రావాలని చూస్తున్నారు. అందుకోసం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ ప్రస్తుతం ఆమె తమిళం లో ‘ఆయాలి’ అనే సూపర్ హిట్ సీరియల్ లో నటిస్తోంది. అలాంటి సీరియల్ ని వదిలి వస్తుందో లేదో చూడాలి. ఇక బిగ్ బాస్ టీం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్న మరో హీరోయిన్ కావ్యశ్రీ.
ఈమె కూడా టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా బాగా పాపులర్. అంతే కాకుండా ‘బిగ్ బాస్ 8’ టైటిల్ విన్నర్ నిఖిల్ కి ఈమె మాజీ ప్రేయసి. యూత్ లో ఆమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ మామూలుది కాదు. ఈమెకు కూడా కోటి రూపాయిలు ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఈమె ఎలాంటి సీరియల్ చేయడం లేదు కాబట్టి , ఈమె ఈ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయి. అదే విధంగా పల్లవి గౌడ , దీపికా రంగరాజు (బ్రహ్మముడి), ఆశికా పదుకొనే (త్రినయని ఫేమ్), రక్షా గౌడ (గుప్పెడంత మనసు) వంటి పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ని కూడా సంప్రదించారట. వీళ్లకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వీరిలో పల్లవి , ఆషిక , రక్షా గౌడ వచ్చే అవకాశాలు ఉన్నాయి . వీరిలో నలుగురు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే , టీఆర్ఫీ రేటింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో నమోదు అవుతాయి. వీళ్ళ కోసం బిగ్ బాస్ టీం కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కుమ్మరించనుంది.






