Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.....

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్ 10’ గురించి సంచలన అప్డేట్..

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది లాగానే ఈఏడాది కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహించి , 7 నుండి 10 మంది సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ కి జడ్జీలుగా వ్యవహరించిన అభిజిత్ , బిందు మాధవి , నవదీప్ వంటి వారు […]

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది లాగానే ఈఏడాది కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహించి , 7 నుండి 10 మంది సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ కి జడ్జీలుగా వ్యవహరించిన అభిజిత్ , బిందు మాధవి , నవదీప్ వంటి వారు ఈ సీజన్ కి కూడా జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ షో కి ఎంపిక అయినటువంటి కంటెస్టెంట్స్ మధ్య గ్రూప్ డిస్కషన్ లు నిర్వహించారు. ఈ గ్రూప్ డిస్కషన్ లో ఎంపికైన వారినే , మనం ‘అగ్నిపరీక్ష’ షోలో చూడబోతున్నాము. అయితే ఈ గ్రూప్ డిస్కషన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

ఈ రౌండ్ లో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు గట్టిగా జరిగి కొట్లాటకు దారి తీసిందట. ఆ కొట్లాటలు కారణంగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు సమాచారం. అదే విధంగా ఈ రౌండ్ లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక వ్యక్తి, ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన వ్యక్తులు హాజరయ్యారట. వీరితో పాటు ‘బిగ్ బాస్’ షో ని రెగ్యులర్ గా అనుసరించే ఒక జపాన్ కుర్రాడు కూడా గ్రూప్ డిస్కషన్ లో పాల్గొన్నట్టు సమాచారం. ఇతని పేరు ఫుటా. ఇన్ స్టాగ్రామ్ లో మంచి పాపులారిటీ ని సంపాదించారు. మీరు ఇతన్ని ఇన్ స్టాగ్రామ్ లో ‘futa_telugu’ అని వెతకొచ్చు. ఇతని అకౌంట్ ని ఓపెన్ చేసి చూస్తే పిన్నెడ్ పోస్ట్ లో బిగ్ బాస్ 10 కి ఆడిషన్ ఇచ్చిన వీడియో ఉంటుంది. ఆ వీడియో ని మీకోసం అందిస్తున్నాం చూడండి.

ఇతను అమెరికాలో డ్రమ్ములు వాయించుకునే వ్యక్తి. అమెరికా లో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమందిని కలిశారట. కాలక్రమేణా వాళ్ళు ఇతనికి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారట. అప్పటి నుండి తెలుగు బాగా నేర్చుకున్నాడట. అమెరికా లో ఒంటరిగా ఉన్న రోజుల్లో అతని తెలుగు స్నేహితులు చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని , అందుకే ఈ వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం ఈ షో కి రావాలని అనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇండియా కి వచ్చిన తర్వాత రాజమండ్రి , కాకినాడ ఇలా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి ఫుడ్ వ్లాగ్ వీడియోస్ కూడా చేశారు ఫుటా. పర దేశానికి చెందిన ఇతను , మన తెలుగు భాషపై చూపిస్తున్న ప్రేమకు , ఒక అవకాశం పొందడం సమంజసమే. అందుకే బిగ్ బాస్ టీం ఇతన్ని ఆడిషన్ వీడియో ని స్వీకరించింది. మరి ఇతను అగ్నిపరీక్ష షో ని ఎదురుకొని , బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Futa Japanese abbai ni (@futa_telugu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper