Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' క్రేజీ అప్‌డేట్..ఆ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ క్రేజీ అప్‌డేట్..ఆ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ఖరారు..ఆ సీజన్ టైటిల్ విన్నర్ తో చర్చలు?

Bigg Boss 10 Telugu: గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ ఇండియా లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోగా సరికొత్త చరిత్ర సృష్టించింది. చాలా వెరైటీ సీజన్ ఇది. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత, అసూయ వంటి ఎమోషన్స్ కంటెస్టెంట్స్ నుండి రావడం, వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్లే, ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇంతకు ముందు సీజన్స్ లో అయితే కంటెస్టెంట్స్ మధ్య నువ్వా, నేనా అనే రేంజ్ లో గొడవలు జరిగేవి. మొదటి సీజన్ నుండి 8వ సీజన్ వరకు ఒకరంటే ఒకరు పడని వాళ్ళే టాప్ 2 గా నిలిచే వాళ్ళు, వారిలో ఎవరో ఒకరు గెలిచేవారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ టాప్ 2 గా నిలిచారు. ఇలాంటి అరుదైన ఘట్టాన్ని మళ్లీ మళ్లీ చూడలేం ఏమో.

అయితే ‘సీజన్ 9’ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో హిట్ అవ్వడం తో, సీజన్ 10(Bigg Boss 10 Telugu) పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మేకర్స్ కూడా ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఉండేలా ఈ సీజన్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘సీజన్ 9’ లో భరణి, తనూజ మరియు ఇమ్మానుయేల్ తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ టాప్ సెలబ్రిటీలు కాదు. కానీ ఈసారి మాత్రం టాప్ సెలబ్రిటీలనే తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే సీజన్ కి కావ్య, జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ లను తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుందట బిగ్ బాస్ టీం. రీసెంట్ గానే సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. అదే విధంగా పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లో, ఈసారి ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ని మరోసారి కంటెస్టెంట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ‘సీజన్ 5’ టైటిల్ విన్నర్ సన్నీ తదుపరి సీజన్ లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహించి, సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో టైటిల్ విన్నర్ మరియు టాప్ 3 కంటెస్టెంట్ ఇద్దరూ కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా వచ్చిన వాళ్ళే అవ్వడంతో ‘అగ్నిపరీక్ష 2’ పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. గత సీజన్ లో వేలల్లో దరఖాస్తులు వస్తే, ఈ సీజన్ లో లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. మే నెలలోనే ఈ సీజన్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రోమో కూడా రాబోతుంది. గత సీజన్ లో లాగా ఈ సీజన్ లో కూడా సామాన్యుడే టైటిల్ కొడతాడా?, లేదంటే సెలబ్రిటీ టైటిల్ కొడతాడా అనేది తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular