
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్ లాంటి గేమ్. ఎన్నో ఎత్తుగడలు వేస్తేనే నెగ్గుతారు. మరి ఇలాంటి గేమ్ లో అవసరమయిన చోట బుద్ది బలం తో పాటు బాహుబలం కూడా ప్రదర్శించాలి. అప్పుడే విజయ తీరాలకు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ లో శనివారం రానే వచ్చింది. ఇంకా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు రానే వచ్చింది. ఇంకో ఒక్కరోజు ఆగితే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఖచ్చితం గా తెలిసిపోతుంది.
ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. సిరి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, రవి, లోబో, శ్రీరామ చంద్ర అలా ఒక అమ్మాయి, ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. సామజిక మాధ్యమాల్లో, ఇతర అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే డేంజర్ జోన్ లో రవి, సిరి, లోబో లు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది పక్కా జరగబోతుంది.
అయితే, ప్రతిచోటా అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో లోబోనే లీస్ట్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టీ చూస్తే లోబో ఈవారం ఎలిమినేట్ అయిపోవాలి. కానీ, లోబోని ఎలిమినేట్ చేస్తారా.. లేదా రవిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి మరోసారి పంపిస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రవిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫేక్ ఎలిమినేషన్ చేస్తారు అని అనుకుంటున్నారు.
లేకపోతే టాప్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి నో ఎలిమినేషన్ పెడతాడేమో బిగ్ బాస్… ఏమో, బిగ్ బాస్(Bigg Boss Telugu 5) లో ఎదైనా జరగొచ్చు. మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో అని తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: డేంజర్ జోన్ లో యాంకర్ రవి… ఎలిమినేట్ అయ్యేది అతడేనా