Badvel by-election: ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొందని భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన ఓట్లు ఎవరికి పడతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీకి జనసేన మిత్రపక్షం కావడంతో ఆ పార్టీ ఓట్లు బీజేపీకే వేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఓట్లపై కూడా అందరిలో అనుమానాలు నెలకొన్నాయి.

అయితే ఇటీవల కాలంలో టీడీపీలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఓట్లు కూడా బీజేపీకే పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారం చేయకపోయినా తమ పార్టీ ఓట్లు బీజేపీకే అని ప్రకటించడంతో పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీలో మరింత చతికిలపడిపోయింది. 2019 ఎన్నికల్లో కనీసం రెండు వేల ఓట్లు కూడా రాని పరిస్థితి. దీంతో ఈ సారి కూడా కాంగ్రెస్ కు ఓట్లు పడవనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీతో పోటీకి సై అంటోందని సమాచారం. మొత్తానికి బద్వేల్ లో ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో టీడీపీ ఓట్ల పైనే అందరి దృష్టి పెరుగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా టీడీపీ వ్యవహరిస్తుండటంతో వారి ఓట్లు కూడా బీజేపీకే పడతాయనేది నేతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రధాన పోటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఓట్లతో బలం పెరిగి ప్రత్యర్థికి పోటీగా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకుల అంచనా.