https://oktelugu.com/

Bhaje Vaayu Vegam Review: భజే వాయు వేగం మూవీ రివ్యూ…

Bhaje Vaayu Vegam Review: 'భజే వాయువేగం' సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 31, 2024 / 10:28 AM IST

    bhaje vayu vegam movie review

    Follow us on

    Bhaje Vaayu Vegam Review: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి. ఇక గత కొద్ది వారాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల సంఖ్య అనేది భారీగా తగ్గిపోయింది. చిన్న సినిమాలు ఒకటి, రెండు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ హీరో అయిన కార్తీకేయ హీరోగా వస్తున్న “భజే వాయువేగం” అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది.

    అయితే ఈ సినిమాతో కార్తీకేయ మంచి సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కొద్ది సంవత్సరాల నుంచి కార్తీకేయ హీరోగా చేస్తున్న సినిమాలు ఏవి పెద్దగా అలరించడం లేదు. ఇక గత సంవత్సరం వచ్చిన ‘బెదురులంక 2012’ సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ భారీ రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ‘భజే వాయువేగం’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

    కథ

    కథపరంగా చూసుకుంటే ఈ సినిమాలో హీరో వాళ్ల నాన్నకి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక అది చేయాలంటే కొంత డబ్బైతే కావాల్సి ఉంటుంది. ఇక ఆ డబ్బులు సంపాదించడానికి హీరో ఎలాంటి రిస్క్ చేశాడు. ఈ క్రమం లో రౌడీలతో తనకు శత్రుత్వం ఎలా ఏర్పడింది. తనకోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు.డబ్బులు సంపాదించే క్రమం లో ఆయన చేసిన క్రైమ్ ఏంటి అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కథపరంగా చూసుకుంటే ఇది రోటీన్ ఫార్మాట్లో సాగే కథ అయినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాని టేక్ ఆఫ్ చేసిన విధానం బాగుంది. నిజానికి ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా చాలా గొప్పగా రాసుకున్నాడు. రొటీన్ సీన్లని ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాయడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా స్టోరీ రోటీన్ గా సాగినప్పటికి డైరెక్టర్ ప్రశాంత్ మాత్రం తన ట్రీట్మెంట్ తో పాటు స్క్రీన్ ప్లే ను కూడా చాలా అద్భుతంగా రాశాడు. అందువల్లే ఆయన ఈ సినిమాతో చాలా వరకు సక్సెస్ సాధించాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా ఫాస్ట్ గా సాగుతూనే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత కొద్ది నిమిషాల పాటు ఈ సినిమా కొంతవరకు డల్ అయింది. అయినప్పటికీ ఆ తర్వాత నుంచి సినిమాను మెయిన్ కథలోకి దర్శకుడు తీసుకెళ్లడంతో ఆ సినిమా ఒక్కసారిగా హై స్పీడ్ లో నడుస్తూ ఉంటుంది.

    అయితే కార్తికేయ ఇంతవరకు ఇలాంటి జానర్ లో సినిమా అయితే చేయలేదు. కాబట్టి ఇది ఆయనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంకా ప్రేక్షకులు కూడా కార్తీకేయ నుంచి కొత్తదనం ఆశిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కథ లో కొత్తదనం ఏమీ లేకపోయినా కూడా ఆయన పోషించిన పాత్రకు మాత్రం న్యాయం చేశాడు. ఇక దర్శకుడు ఈ సినిమాని తీసిన విధానం అయితే ప్రతి ప్రేక్షకుడిని కూడా ఎంజాయ్ చేసింది. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని ట్విస్ట్ లు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదనిపిస్తుంది. వాటి ప్లేస్ మెంట్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చి ఉంటే అవి చాలా బాగా హెల్ప్ అయ్యేవి…

    Also Read: Gangs Of Godavari Twitter Talk: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ టాక్: ఈ టాక్ అసలు ఊహించలేదు, అక్కడే తేడా కొట్టిందట! విశ్వక్ సేన్

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తికేయ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్ ని కార్తీకేయ 100% స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. అందువల్లే దీనికి ది బెస్ట్ అవుట్ ఫుట్ అయితే వచ్చింది. ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కార్తికేయ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటన మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇంతకుముందు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన విలన్ గా చేసినప్పుడు తన నటనలోని ప్రావీణ్యాన్ని బయట పెట్టాడు. ఇక అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ని మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. ఇక కార్తీకేయతో పాటుగా మిగితా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు అయితే బాగా నటించారు. ఇక చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ లో నటించిన రాహుల్ హరిదాస్ మరోసారి ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఇక తనకు ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అవుతుందనే చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి తను సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ఒక మంచి క్యారెక్టర్ ని దక్కించుకోవడమే కాకుండా ఒక చక్కటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు…

    టెక్నికల్ అంశాలు…

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదు. ఇక అర్జున్ రెడ్డి లాంటి సినిమాకి మ్యూజిక్ అందించిన రదన్ ఈ సినిమాకి మ్యూజిక్ ని ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కొంతవరకు పర్లేదు అనిపించేలా ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ మాత్రం యాక్షన్ బ్లాక్ ను తెరకెక్కించడంలో తన విజువల్స్ తోపాటు కొన్ని డిఫరెంట్ షాట్స్ ని బాగా డిజైన్ చేశాడు. ఇక డైరెక్టర్ సినిమాకి ఎలాంటి మూడ్ అయితే కావాలనుకున్నాడో అలాంటి ఒక మూడ్ ను క్రియేట్ చేయడంలో రాజశేఖర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…ఇక యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు వాళ్ళు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా కోసం ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తుంది…

    Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 స్టోరీ లీక్…సేనాపతి ఏం చేయబోతున్నాడంటే..?

    ప్లస్ పాయింట్స్

    కార్తికేయ యాక్టింగ్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్

    రోటీన్ స్టోరీ
    డైరెక్షన్ లో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి…

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్

    భజే వాయు వేగం అంత బాగున్నప్పటికి ఏదో ఒక తెలియని వెలితి అయితే ఉండిపోయింది…