Simbu: తమిళ స్టార్ శింబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అనంతరం హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించాడు. శింబు నటించిన సినిమాలు తెలుగులో విడుదలయ్యేవి. గతంలో ఆయన సినిమాలకు టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉండేది. అనూహ్యంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శింబు… సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశాడు. రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం శింబు ‘ థగ్ లైఫ్'(Thug Life) మూవీలో నటిస్తున్నారు. అలాగే తన 48వ సినిమా చేయబోతున్నారు. దేశింగు పెరియ స్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కమల్ హాసన్(Kamal Haasan) నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే… శింబు వయసు 41 ఏళ్లు దాటిపోయింది. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. తాజా సమాచారం ప్రకారం శింబు పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అతని కుటుంబ సభ్యులు మ్యాచ్ ఫిక్స్ చేశారట.
త్వరలోనే శింబు పెళ్లి బాజాలు మోగనున్నాయని తమిళ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆయన పెళ్లి ఓ తెలుగు నటుడు(Telugu Actor) కుమార్తెతో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఆ నటుడు ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీంతో ఇకనైనా తన బ్యాచిలర్ లైఫ్ కి శింబు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో కూడా శింబు పెళ్లి పై చాలా వార్తలు వచ్చాయి.
Also Read: Bhaje Vaayu Vegam Review: భజే వాయు వేగం మూవీ రివ్యూ…
చివరికి అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. కాగా శింబు గతంలో పలువురు హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్ నడిపాడు. వల్లభన్ సినిమా చేస్తున్న సమయంలో నయనతారతో ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హన్సికతో చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. వీళ్లిద్దరి వ్యవహారం దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని శింబు తండ్రి రాజేందర్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. శింబు-హన్సిక ప్రేమ వ్యవహారం కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు.