https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 స్టోరీ లీక్…సేనాపతి ఏం చేయబోతున్నాడంటే..?

శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటే ఇక ఆయన కూడా పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా మారుతాడు...రోబో సినిమా తో పాన్ ఇండియా సినిమా చేసినప్పటికీ ఆ తర్వాత ఆయన సరైన సక్సెస్ ను అందుకోలేక మార్కెట్ పరంగా భారీగా డౌన్ అయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 30, 2024 / 07:11 PM IST

    Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: కోలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న దర్శకుడు శంకర్…ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో లీక్ అయిందనే చెప్పాలి. అయితే భారతీయుడు సినిమా ప్రకారం ఆ సినిమా క్లైమాక్స్ లో ముసలి కమలహాసన్ విదేశాలకు వెళ్ళిపోతాడు.

    మరి తను విదేశాల నుంచి తిరిగి రావాలి అంటే అప్పటితో పోలిస్తే ఇప్పటికీ సమాజంలో విపరీతమైన అన్యాయాలు, అక్రమాలు, లంచాలు పెరిగిపోతున్నాయి. మరి తను విదేశాల నుంచి ఎప్పుడు ఎలా వస్తాడు అంటే ఈ సినిమా మొదట సిద్ధార్థ్ మీద ఓపెన్ అవుతుందట. లంచానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తుంటే అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న సేనాపతి విదేశాల నుంచి వస్తారట. ఇక మొత్తానికైతే కమలహాసన్ తనదైన రీతిలో ఈ సినిమా కోసం సిద్ధార్థ్ కోసం పోరాటం చేసి సినిమాని ముగిస్తాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో గత కొద్దిరోజుల నుంచి విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జూన్ ఒకటోవ తేదీన నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి చిరంజీవి, రామ్ చరణ్ లాంటి దిగ్గజ హీరోలతో పాటుగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కూడా హాజరు కాబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…

    ఇక ఇదిలా ఉంటే శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటే ఇక ఆయన కూడా పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా మారుతాడు…రోబో సినిమా తో పాన్ ఇండియా సినిమా చేసినప్పటికీ ఆ తర్వాత ఆయన సరైన సక్సెస్ ను అందుకోలేక మార్కెట్ పరంగా భారీగా డౌన్ అయ్యాడు…ఇక ఈ సినిమా జులై 12 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది…