Gangs Of Godavari Twitter Talk: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ టాక్: ఈ టాక్ అసలు ఊహించలేదు, అక్కడే తేడా కొట్టిందట! విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ నందమూరి ఫ్యామిలీకి చాలా క్లోజ్. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు సపోర్ట్ చేశాడు. ఈసారి నందమూరి బాలకృష్ణ విశ్వక్ సేన్ కోసం వచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాలయ్య హీరో విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తాడు.

Written By: S Reddy, Updated On : May 31, 2024 8:55 am

Gangs Of Godavari Twitter Talk

Follow us on

Gangs Of Godavari Twitter Talk: విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రూరల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. మరి మూవీ అంచనాలు అందుకుందా? ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం..

విశ్వక్ సేన్ నందమూరి ఫ్యామిలీకి చాలా క్లోజ్. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు సపోర్ట్ చేశాడు. ఈసారి నందమూరి బాలకృష్ణ విశ్వక్ సేన్ కోసం వచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాలయ్య హీరో విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తాడు. బాలయ్య రాకతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి భారీ ప్రచారం దక్కింది. దానికి తోడు బాలయ్య హీరోయిన్ అంజలిని తోసేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఆ వివాదం పరోక్షంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసింది.

హైప్ మధ్య విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం ఆశించిన స్థాయిలో లేదనేది ఆడియన్స్ అభిప్రాయం. దర్శకుడు కృష్ణ చైతన్య కథ పరంగా మంచి సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దాన్ని తెరపై ఆవిష్కరించడంలో విఫలం చెందారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లు సాగుతుంది. సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బోరింగ్ గా సాగుతుంది. ఎమోషనల్ గా మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకోలేదని అంటున్నారు.

విలన్స్ తేలిపోయారు. అసలు అంజలికి స్క్రీన్ స్పేస్ లేదు. నేహా శెట్టి మాత్రం మెప్పిస్తుంది. టైటిల్ కూడా ఆడియన్స్ ని మిస్ లీడ్ చేసిందని కొందరి అభిప్రాయం. విశ్వక్ సేన్ నటన మాత్రం కెరీర్ బెస్ట్ అంటున్నారు. రఫ్ అండ్ రస్టిక్ రోల్ లో విశ్వక్ సేన్ జీవించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. యువన్ బీజీఎమ్ బాగుందని అంటున్నారు. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ బిలో యావరేజ్ అని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.