spot_img
Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh- Diwali: దీపావళి వేళ బండ్ల గణేష్ సంచలన ట్వీట్ వైరల్... మరీ లక్షల్లోనా!

Bandla Ganesh- Diwali: దీపావళి వేళ బండ్ల గణేష్ సంచలన ట్వీట్ వైరల్… మరీ లక్షల్లోనా!

Bandla Ganesh- Diwali: బండ్ల గణేష్ చర్యలు ఊహాతీతం. ఆయన మాటలు, సోషల్ మీడియా ట్వీట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే చర్చకు తెర లేపుతాయి. తాజాగా దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ భారీ మొత్తంలో బాణాసంచా సామాగ్రి కొన్నారు. తాను కొన్న దీపావళి టపాసులను ఇంటి ముందు పేర్చి కుటుంబ సభ్యులతో పాటు ఫోటో దిగారు. సదరు ఫోటో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద మొత్తంలో ఉన్న బాణాసంచా చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇన్ని టపాసులు మీ కుటుంబం కోసమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh- Diwali
Bandla Ganesh- Diwali

ఇక బండ్ల గణేష్ కొన్న ఆ టపాసుల విలువ కూడా బయటకు వచ్చింది. దాదాపు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టిన దీపావళి బాణాసంచా బండ్ల గణేష్ కొనుగోలు చేశాడట. కాగా ఆయనకొనుగోలుచేసిన ఈ పటాసులు మొత్తం తమ కుటుంబం కోసం కాదట. వాటిలో కొన్ని సన్నిహితులకు, చుట్టుపక్కల జనాలకు పంచుతారని సమాచారం. ప్రతి ఏడాది బండ్ల గణేష్ ఇలానే భారీగా బాణా సంచా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ గా మారింది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన బండ్ల గణేష్ ని ఆయన అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా పోస్ట్స్ కి పవన్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతారు. బండ్ల గణేష్ ప్రతి పోస్ట్ పై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. దీపావళి వేడుకలు కోసం భారీగా బాణా సంచా కొనుగోలు చేసిన బండ్లను నువ్వు తోపు అంటూ కొనియాడుతున్నారు.

Bandla Ganesh- Diwali
Bandla Ganesh- Diwali

మరోవైపు బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ తో ఒక మూవీ చేయాలని వారు భావిస్తున్నారు. గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కాయి. తీన్ మార్ నిరాశపరిచినా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ అతిపెద్ద హిట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తానని బండ్ల గణేష్ అంటున్నారు. తమ కాంబినేషన్ లో వచ్చే మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు చేస్తాము అంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper