spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhanda: నేను కేవలం నా దర్శకుడు చెప్పింది చేస్తాను అంతే- బాలయ్య

Akhanda: నేను కేవలం నా దర్శకుడు చెప్పింది చేస్తాను అంతే- బాలయ్య

Akhanda: బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా అఖండ.. డిసెంబరు 2న విడుదలైన ఈ సినిమా.. అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్టాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య క్రేజ్​ ఎక్కడా తగ్గట్లేదు. ఓపెనింగ్స్​లోనే భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. కాగా, ఈ సినిమాను బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబీ సినిమాస్​లో వీక్షీంచింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Akhanda Movie

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..సనిమాకు వస్తోన్న స్పందన చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. బోయపాటి ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. ఓ నాడు రామారాపు భక్తిని బ్రతికిస్తే.. ఇప్పుడు అఖండ ఆ భక్తికి ఊపిరి పోసినట్లు అనిపిస్తోంది. అందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాను అఖండమైన విజయం వైపు నడిపించిన ప్రేక్షకమహాసేయులందరికీ ధన్యవాదాలు.  అని తెలిపారు.

దీంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ..తెలుగు వాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. కొత్తదనాన్ని ఎప్పుడూ వాళ్లు స్వాగతిస్తారు. అందుకు నిదర్శనమే ఈ అఖండ. ఇంటర్వెల్​లో చిన్న చిన్న పిల్లలు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విని చాలా ఆనందమేసింది. ఈ సినిమా కేవలం నా విజయం కాదు.. సినీ పరిశ్రమకు విజయం. తెరపై నన్ను నేను చూసుకిని చాలా ఆశ్చర్యపేయా. థమన్​ తన మ్యూజిక్​తో సినిమాకు ప్రాణం పోశాడు. నేను దర్శకుడి ఆర్టిస్ట్‌ని. నేను కేవలం నా దర్శకుడి సూచనలను పాటిస్తాను. నాకు ప్రతి సినిమా సమానమే” అని బాలయ్య చెప్పుకొచ్చారు.

అనంతరం బోయపాటు మాట్లాడుతూ.. అఖండ సూపర్​ హిట్​ అని అందరూ చెబుతున్నారు. ఈ సినిమా కరోనా సెకెండ్​వేవ్​ తర్వాత వచ్చింది. చాలా కాలం తర్వాత సినిమా థియేటర్​లో భారీగా జనాలు, వేడుకలను చూశా.. ఈ అఖండ విజయం సినిమా ఇండస్ట్రీది. అని బోయపాటి అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version