spot_img
Homeఎంటర్టైన్మెంట్Balayya: యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న అఖండ టీమ్​.. కేసీఆర్​పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Balayya: యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న అఖండ టీమ్​.. కేసీఆర్​పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Balayya: అఖండ సినిమాతో టాలీవుడ్​లో సరికొత్త ఊపు రప్పించిన నందమూరి హీరో బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమా విజయవంతమైన శుభ సందర్భంలో బాలయ్య అండ్ హిస్ టీమ్​ రెండు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటోంది. తాజాగా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు అఖండ టీమ్. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వేదమంత్రాలతో ఆశీర్వదిస్తూ బాలయ్యకు తీర్థ ప్రసాదాలు సమర్పంచారు. మొదట్లో ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలగ్గా.. బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.

nandamuri-balakrishna-and-akhanda-team-visits-yadadri-temple

దర్శన అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన.. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ చూపించిన ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమని కొనియాడారు. భక్తులు కూడా ఆలయ విశిష్టతను, స్వచ్ఛతను పరిరక్షించాలని కోరారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ అఖండ’ సినిమా విజయవంతమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నాం. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చాం. నా ఇష్ట దైవం లక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలయ నిర్మాణంపై కేసీఆర్ చూపిన చొరప ప్రశంసనీయం. ఇక దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నా.  అని చెప్పుకొచ్చారు.

కాగా, అఖండలో అఘోరాగా బాలయ్య బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఇందులో ధర్మ సంరక్షకుడిగా కనిపించిన బాలయ్య నటనకు వేరే లెవెల్​లో రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా కనిపించగా.. థమన్​ సంగీతం అందించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version