Heroines: సినిమాల్లో ఛాన్స్ రావాలంటే దాదాపు అన్ని కళలు తెలిసి ఉండాలి. ఏ పాత్ర వచ్చినా చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడు అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి. ఇక హీరోయిన్లు అందంగా ఉన్నంతసేపు వారికి ఆఫర్స్ బాగానే వస్తుంటాయి. కానీ కాస్త గ్లామర్ తగ్గేసరికి వారిని పట్టించుకోరు. ఈ తరుణంలో కొందరు హీరోయిన్లుగానే కాకుండా ఇతర పాత్రల్లోనూ నటించారు. అయితే గ్లామర్ షో చేసిన హీరోయిన్లు కొందరు విలన్ పాత్రల్లో కూడా దుమ్మురేపిన వారున్నారు.. విలన్ గా నటించమని ఆఫర్స్ రావడంతో ఏమాత్రం తడుముకోకుండా ఒప్పేసుకున్నారు. తెలుగు సినిమాలో ఓ వైపు అందాలు ఆరబోసి.. ఆ తరువాత నెగెటివ్ రోల్స్ చేసిన భామలు చాలా మందే ఉన్నారు. అలాంటివారిపై స్పెషల్ ఫోకస్..
రమ్యకృష్ణ: ఒకప్పటి అందాల తారల్లో రమ్యకృష్ణ ఒకరు. గ్లామర్ షో చేయడంలో రమ్యకృష్ణకు పోటీగా ఎవరూ రాలేదు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికైనా రెడీ అంటారు. ఈ తరుణంలో ఆమె విలన్ గానూ మెప్పించారు. నరసింహా సినిమాలో ఆమె విలనిజం చూసి అడవాళ్లు ఇలా కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో రజనీకాంత్ కు పోటీపడి మరీ నటించారు. ఇటీవల వచ్చిన రిపబ్లిక్ సినిమాల్లోనూ రమ్యకృష్ణ నెగెటివ్ రోల్స్ చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్: తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఆ సమయంలో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ విలన్ గా నటించడం ఎప్పుడు మొదలు పెట్టిందో ఆమెకు వరుగా అవకాశాలు వస్తున్నాయి. సందీప్ కిషన్ నటించిన తెనాలి మూవీ నుంచి ఆమె విలన్ గానే నటిస్తోంది. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర బాగా పాపులర్ అయింది.
సమంత: సమంత అనగానే ఎవరికైనా క్యూట్ హీరోయిన్ అని తెలుసు. కానీ ఆమె విలన్ గా నటించిందంటే ఎవరూ నమ్మరు. కానీ మలయాళం మూవీ విక్రం యూబీపత్తు ఎంద్రాకుల్లం సినిమాలో ఈమె ప్రతినాయకురాలు పాత్ర పోషించి మెప్పించింది.
సౌందర్య: అలనాటి మేటి హీరోయిన్ సౌందర్య కూడా నెగెటివ్ రోల్ లో కనిపించారు. శ్రీకాంత్ నటించిన నా మనసిస్తారా సినిమాలో ఆమె ప్రతికూల నాయక పాత్ర పోషించింది. అయితే ఆమెను నెగెటివ్ గా చూడడం ఇష్టం లేకపోవడంతో మరోసారి అలాంటి పాత్రలో నటించలేదు.
త్రిష: మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో అవకాశం దొరికిన ప్రతీ సినిమా చేస్తోంది. ఈ క్రమంలో ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ సినిమాలో ఆమె విలన్ పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కలే పడ్డాయి.
కాజల్ అగర్వాల్: ఈ భామ కూడా విలన్ గా నటించిందా..? అని అందరికీ ఆశ్యర్యపరిచింది. సీత అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేసి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆమె మరోసారి నెగెటివ్ రోల్ లో కనిపించలేదు.
Also Read: తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్‌ను నెట్టింట్లో షేర్ చేసిన సమంత.. అందులో ఏముందో తెలుసా?
రాశి: అందాల రాశి చక్కటి స్మైల్ కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. అందుకే ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఈ క్రమంలో ఆమె ‘నిజం’ సినిమాలో విలన్ పాత్ర పోషించింది. ఆ తరువాత సినిమాలకు పులిస్టాప్ పెట్టి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.
రీమాసేన్: హీరోయిన్ గా ఎంత అందంగా నటించిందో విలన్ గా కూడా పోషించి మెప్పించింది రీమాసేన్. వల్లభ సినిమాలో ఆమె నటనను అందరూ మెచ్చుకున్నారు.
Also Read: వర్ష, ఇమ్మానియేల్ ప్రైవేట్ ఫోటో అందరి ముందు లీక్ చేసిన రోజా..!