TRP: 2021లో అత్యధిక టీఆర్పీ సాధించిన చిత్రాలివే..!

TRP 2021: పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. కాలానికి తగ్గటుగా ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమావాళ్లు ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఎక్కువగా నష్టపోయేది కూడా వాళ్లే. కరోనా ఎంట్రీకి ముందు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడా పరిస్థితులు ఎంతమాత్రం కూడా కన్పించడం లేవు. కరోనా దెబ్బకు థియేటర్ల మూతపడటంతో ఓటీటీ హవా నడుస్తోంది. చిన్న సినిమాలన్నీ కూడా డైరెక్టుగా ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. బడా సినిమాలు మాత్రమే […]

Written By: NARESH, Updated On : December 27, 2021 4:12 pm
Follow us on

TRP 2021: పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. కాలానికి తగ్గటుగా ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమావాళ్లు ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఎక్కువగా నష్టపోయేది కూడా వాళ్లే. కరోనా ఎంట్రీకి ముందు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడా పరిస్థితులు ఎంతమాత్రం కూడా కన్పించడం లేవు.

vakeel Saab Movie TRP

కరోనా దెబ్బకు థియేటర్ల మూతపడటంతో ఓటీటీ హవా నడుస్తోంది. చిన్న సినిమాలన్నీ కూడా డైరెక్టుగా ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. బడా సినిమాలు మాత్రమే థియేటర్లను నమ్ముకున్నారు. ప్రేక్షకులు సైతం ఓటీటీలకు అలవాటు పడటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు పైరసీ రక్కసీ ఇండస్ట్రీని కుదేలు చేస్తోంది.

ఇలాంటి నేపథ్యంలోనే షూటింగులు పూర్తి చేసుకున్న సినిమాలన్నీ వీలైతే ఓటీటీ లేదంటే థియేటర్లలో వస్తున్నాయి. ఇంతకు ముందులా నిర్మాతలు డిమాండ్లు చేసే పరిస్థితులు లేకపోవడంతో వచ్చినకాడికి సినిమా హక్కులను అమ్మేసుకుంటారు. ఈక్రమంలోనే కొత్త సినిమాలన్నీ కూడా నెలా, రెండునెలల వ్యవధిల్లోనే టీవీల్లోనూ ప్రసారమవుతున్నాయి.

గతంలో కొత్త సినిమాలు టీవీల్లో ప్రసారం కావాలంటే ఏడాది, ఏడాదిన్నర సమయం పట్టేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో కేవలం నెలరోజుల వ్యవధిల్లోనే బుల్లితెరపై కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటికి టీఆర్పీ కూడా భారీగా వస్తుండటంతో టీవీ ఛాన్సల్స్ కొత్త సినిమాలు ప్రసారమయ్యే డేట్స్ తో భారీ హోర్డింగ్స్ పెడుతూ ప్రచారం చేసుకుంటున్నాయి.

Also Read: బాలయ్య “అఖండ” సినిమా తొలిరోజు కలెక్షన్ ఎంతంటే…

2021లో బుల్లితెరపై అనేక కొత్త సినిమాలు సందడి చేశాయి. వీటిలో అత్యధికంగా టీఆర్పీ సాధించిన చిత్రాలను ఓసారి పరిశీలించినట్లయితే.. మొదటి స్థానంలో వకీల్ సాబ్ మూవీ నిలుస్తుంది. ఈ మూవీ జీ తెలుగులో ప్రసారంకాగా టీఆర్పీ 19.12 వచ్చింది. ఆ తర్వాత స్థానంలో ఉప్పెన మూవీ నిలుస్తుంది. ఈ మూవీ స్టార్ మాలో టెలికాస్ట్ కాగా 18.51 టీఆర్పీ వచ్చింది.

రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీకి 11.71, ఉప్పెన(రెండోసారి) 11.37, ‘టక్ జగదీష్’ మూవీకి 10.90, జాంబిరెడ్డికి 9.7, జాంబిరెడ్డి(రెండోసారి) 8.1, క్రాక్(రెండోసారి) 7.9 టీఆర్పీ వచ్చింది. ఇవన్నీ కూడా స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యాయి. అలాగే జెమిని టీవీలో ప్రసారం అయిన జాతిరత్నాలు మూవీకి 9.7, మహర్షి మూవీకి 7.8 టీఆర్పీ రాగా.. జీతెలుగులో ప్రసారమైన ‘రంగ్ దే’ మూవీకి 7.22 టీఆర్పీ వచ్చింది.

Also Read: బాలయ్య వసూళ్ల ప్రభంజనం… వకీల్ సాబ్ కి చెక్ పెట్టిన అఖండ!