Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి కి చాలా మంచి గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి ని మించినవారు ఎవరు ఉండరనేది వాస్తవం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. సినిమాలతో కూడా ఆయన భారీ విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో చిరంజీవి ని 400 కోట్ల క్లబ్లో చేర్చాడు. ఇక వచ్చే సంవత్సరం సైతం మరో సంక్రాంతి హిట్ దక్కించుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ ని పెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఒక సినిమా కోసం 30 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. అందులో చాలా భాగం ఆయన కొన్ని సేవ కార్యక్రమాల కోసం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆయన లో ప్రొఫైల్ ని మైంటైన్ చేస్తూ ఆయన చేసే సేవా కార్యక్రమాలను ఎక్కడ తెలువకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన సంపాదించే దాంట్లో కొన్ని డబ్బులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడనే విషయం తన సన్నిహితులకు తప్ప వేరే ఇంకెవరికి తెలియదంట. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ కి సేవ చేయాలనే ఒక దృక్పథం కలగడం నిజంగా చాలా గొప్ప విశేషం అంటు చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు…
ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలతో సినిమాలను చేస్తున్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సీనియర్ హీరోలందరితో సినిమా చేసిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతాలను సంపాదించడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు చేశారు.
ఒక నాగార్జునతో సినిమా చేసి సక్సెస్ సాధిస్తే నలుగురు సీనియర్ హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన ఈ తరం ఏకైక దర్శకుడిగా తను నిలిచిపోతాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది…