Homeఆంధ్రప్రదేశ్‌Amrapali Kata And Smita Sabharwal: ఏపీలో ఆమ్రపాలి.. తెలంగాణలో స్మితా సబర్వాల్.. పోస్టింగ్ లు...

Amrapali Kata And Smita Sabharwal: ఏపీలో ఆమ్రపాలి.. తెలంగాణలో స్మితా సబర్వాల్.. పోస్టింగ్ లు లేక తిప్పలు..

Amrapali Kata And Smita Sabharwal: కాటా ఆమ్రపాలి.. స్మితా సబర్వాల్.. మహిళా ఐఏఎస్ అధికారులు. వీరిద్దరిలో దూకుడు ఎక్కువ. డైనమిక్ గా పనిచేసే తీరు ఎక్కువ. పైగా వీరిని సూపర్ స్టార్ ఐఏఎస్ అధికారులు అని పిలిచేవారు. వార్తల్లో కూడా ఎక్కువగా కనిపించేవారు. అందానికి అందం.. పని తీరుకు పని తీరు.. ఫలితంగా వీరిద్దరూ మీడియాలో నిత్యం కనిపించేవారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాలలో పనిచేసే తమ సమర్ధతను నిరూపించుకున్నారు. మీడియా వీరిద్దరి గురించి ఎక్కువగా వార్తలు […]

Amrapali Kata And Smita Sabharwal: కాటా ఆమ్రపాలి.. స్మితా సబర్వాల్.. మహిళా ఐఏఎస్ అధికారులు. వీరిద్దరిలో దూకుడు ఎక్కువ. డైనమిక్ గా పనిచేసే తీరు ఎక్కువ. పైగా వీరిని సూపర్ స్టార్ ఐఏఎస్ అధికారులు అని పిలిచేవారు. వార్తల్లో కూడా ఎక్కువగా కనిపించేవారు.

అందానికి అందం.. పని తీరుకు పని తీరు.. ఫలితంగా వీరిద్దరూ మీడియాలో నిత్యం కనిపించేవారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాలలో పనిచేసే తమ సమర్ధతను నిరూపించుకున్నారు. మీడియా వీరిద్దరి గురించి ఎక్కువగా వార్తలు రాస్తూ ఉండేది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు అధికారులు ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవారు. విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఈ అధికారులకు పోస్టింగ్ ఎందుకు లభించలేదు.. గ్రాఫ్ ఎందుకు తగ్గిపోయింది.. రాజకీయ సమీకరణాలు.. ఇతర అంశాలు వీరికి ఇబ్బందికరంగా మారాయా..

ఆమ్రపాలి తనకు పోస్టింగ్ కేటాయించే విషయంలో న్యాయపోరాటం చేసింది. అందులో గెలిచింది. ఈమెకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేటాయింపులలో ఏపీ క్యాడర్ లభించింది. ఈమెకు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయాలనేది బలమైన ఆకాంక్ష. అనేక రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ ఈమె ఏపీ క్యాడర్లో పనిచేయాల్సి వచ్చింది. సరైన ప్రాధాన్యం లభించకపోవడంతో వరుసగా సెలవులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎటువంటి బాధ్యతలు లేని నార్మల్ ట్రాన్స్ఫర్ ను ఎదుర్కొన్నారు. ఈయనకు సమర్ధత ఉంది. కాకపోతే సమీకరణాలవల్ల పోస్టింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది. గతంలోని వరంగల్ కలెక్టర్ గా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. ఆ అనుభవాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకోలేదు.

స్మితా సబర్వాల్

ఈమె క్రేజీ అధికారిగా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువకాలం తెలంగాణ రాష్ట్రంలో పనిచేశారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులలో ముఖ్యపాత్ర పోషించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈమెకు విపరీతమైన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒక దశలో ఈమె నెక్స్ట్ టు సీఎం అన్నట్టుగా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన తర్వాత స్మితకు ప్రాధాన్యం తగ్గిపోయింది. పైగా అస్మిత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరోక్ష విధానంలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈమె వ్యవహార శైలిపై కూడా ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం ఉండడంతో ప్రాధాన్యం లేని విభాగాలు కేటాయించారు. దీంతో ఆమె ఆ బాధ్యతలు స్వీకరించడం కంటే.. ఖాళీగా ఉండడానికి ఇష్టాన్ని చూపించారు.

ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులకు ఇంపార్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది అధికారులు ప్రభుత్వాలకు తగ్గట్టుగా మారకుండా.. తమకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోవడమే ఇక్కడ ఇబ్బందికరంగా మారుతుంది. స్మిత.. ఆమ్రపాలి వీరిద్దరూ సమర్థవంతమైన అధికారులు. రాజకీయ కారణాలవల్ల పోస్టులు లభించకపోవడంతో దీర్ఘకాలం సెలవులో ఉన్నారు ఇటువంటి అధికారులకు పోస్టింగులు లభించకపోవడం ఒకరకంగా ప్రజలకు ఇబ్బంది. సమర్ధత ఉన్న అధికారులు దీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావడం దాదాపు అసాధ్యం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper