Balayya and Laya : తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనే టాక్ చాలా కాలం నుండి ప్రచారం లో ఉంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని కొంతమంది హీరోయిన్స్ నిరూపించారు. వాళ్ళ పరిధి దాటకుండా కేవలం ఒక అచ్చ తెలుగు అమ్మాయి లాగానే సంసారపక్షమైన సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను చేసుకున్నారు ఈ హీరోయిన్స్. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ(Laya Gorti). ‘భద్రం కొడకో’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర అరంగేట్రం చేసిన లయ, ఆ తర్వాత ‘స్వయంవరం’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో కలిసి ‘విజయేంద్ర వర్మ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన అనుభూతులను రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!
ఆమె మాట్లాడుతూ ‘ విజయేంద్ర వర్మ సినిమా షూటింగ్ లో ఒక పాట రిహార్సల్స్ లో నేను, బాలయ్య గారు పాల్గొన్నాము. నేను డ్యాన్స్ చేస్తున్న సమయంలో చూసుకోకుండా బాలయ్య గారు కాలు తొక్కేసాను. అప్పుడు నేను క్షమించండి సార్, చూసుకోకుండా తొక్కేసాను అని బాలయ్య గారితో చెప్పాను. అప్పుడు బాలయ్య దానికి సమాధానం చెప్తూ షూటింగ్ కి వచ్చిన మొదటి రోజు నా కాలే తొక్కేస్తావా..?, అసలు షూటింగ్ లేదు, ఏమి లేదు, ప్యాకప్, అసలు ఈ అమ్మాయిని సినిమా నుండి తీసేయండి అని అన్నాడు. నాకు భయం వేసింది, నిజంగానే బాలయ్య గారు ఫీల్ అయ్యారేమో అని. పక్కకి వెళ్లి నా తప్పేమి లేదు అంటూ ఏడుస్తూ ఉన్నాను. అది బాలయ్య గమనించి ఆ అమ్మాయి ఏడుస్తుంది, వెంటనే పిలవండి అని పిలిపించుకున్నాడు. ఏంటి దీనికే ఏడ్చేస్తున్నావా?, నేనేదో సరదాకి ఇలాంటివి బోలెడన్నీ అంటూ ఉంటాను పట్టించుకోకండి అని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చింది లయ.
Also Read : ప్రశాంత్ నీల్ కి ఒక టాస్క్ ఇచ్చిన ఎన్టీఆర్..? ఇదంతా దాని కోసమేనా..?
లయ మన తెలుగు లో చేసిన అత్యధిక సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. అగ్ర హీరోయిన్ గా కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడి ఒక పక్క గృహిణి గా, మరో పక్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ని కొనసాగించిన లయ, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ చిత్రంలో లయ ఒక కీలక పాత్ర పోషించింది. ఆమెకు సంబంధించిన లుక్ కూడా రీసెంట్ గానే విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.