Balayya and Boyapati : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి సరికొత్త జీవితాన్ని అందించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది బోయపాటి శ్రీను(Boyapati Srinu) మాత్రమే. ఇన్నేళ్ల ఆయన కెరీర్ లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ తో పని చేసాడు. కానీ బోయపాటి శ్రీను స్థానం బాలయ్య మనసులో ఎంతో ప్రత్యేకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నరసింహ నాయుడు చిత్రం తర్వాత సరైన కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలయ్యకు ‘సింహా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించి మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ చిత్రం తర్వాత బాలయ్య కి మళ్ళీ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఆ సమయంలో ‘లెజెండ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించాడు బోయపాటి. ఈ రెండు సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ వరుస డిజాస్టర్స్ ని అందుకుంటూ వస్తున్నాడు. ‘రూలర్’ చిత్రం తర్వాత ఇక బాలయ్య కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘అఖండ'(Akhanda Movie) లాంటి బ్లాక్ బస్టర్ తగిలింది.
Also Read : ప్రశాంత్ నీల్ కి ఒక టాస్క్ ఇచ్చిన ఎన్టీఆర్..? ఇదంతా దాని కోసమేనా..?
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అతి తక్కువ టికెట్ రేట్స్ తోనే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత బాలయ్య మైండ్ సెట్ కూడా మారింది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ వస్తున్నాడు. ఇదంతా జరగడానికి బోయపాటి శ్రీను కూడా ఒక మూలకారణమే. అలాంటి బోయపాటి తో బాలయ్య బాబు ప్రస్తుతం ‘అఖండ 2’ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఈమధ్య కాలంలో బాలయ్య కి బోయపాటి శ్రీను కి చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మన అందరికీ తెలిసిందే, బోయపాటి సినిమాలకు ఆడియన్స్ బుర్ర ని డీప్ ఫ్రీజర్ లో పెట్టి థియేటర్ కి వెళ్ళాలి. ఆయన సినిమాలో లాజిక్స్ వెతకకూడదు, కేవలం మ్యాజిక్స్ ని మాత్రమే చూడాలి. తన ప్రతీ సినిమాలో లాగానే ఈ సినిమా కోసం కూడా బోయపాటి ఒక ఆయుధాన్ని తయారు చేయించాడట. ఆ ఆయుధం ఒక గద. ఆ గాథపై త్రిసూలం గుర్తు ఉంటుంది. పురాణాల మీద మంచి పట్టు ఉన్న బాలయ్య, ఇది గద నా?, గద ఎక్కడైనా ఇలా ఉంటుందా? అని సీరియస్ గా అడిగాడట. అప్పుడు బోయపాటి ‘మన సినిమాలో అలాగే ఉంటుంది బాబు’ అని చెప్పాడట. ఈ మాటలకు బాలయ్యకి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య కాసేపు వాదనలు జరిగాయి. సెట్స్ లో వాతావరణం మొత్తం హీట్ గా మారిపోయింది. కానీ చివరికి ఇద్దరు సర్దుకొని షూటింగ్ ని కానిచ్చేశారు. సినిమాలో ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Raed : అఖండ 2 లో వేవ్ స్టెప్ వేస్తున్న బాలయ్య…డ్యాన్స్ తో యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడా..?