Homeఎంటర్టైన్మెంట్Balakrishna Vs Chiranjeevi: మరోసారి బాలయ్య మిస్.. చిరంజీవి డైరెక్ట్ గా యుద్దానికి సిద్ధం అయ్యాడా?

Balakrishna Vs Chiranjeevi: మరోసారి బాలయ్య మిస్.. చిరంజీవి డైరెక్ట్ గా యుద్దానికి సిద్ధం అయ్యాడా?

Balakrishna Vs Chiranjeevi: చిరంజీవి(Megastar Chiranjeevi) తో సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రతీ ఒక్కరు ఎంతో స్నేహం గా ఉంటారు, ఒక బాలయ్య(Nandamuri Balakrishna) తప్ప అని ఇండస్ట్రీ లో అందరు అంటూ ఉంటారు. వీళ్లిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది అనేది వాస్తవం అనేలా రీసెంట్ గా వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు జరిగాయి. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి […]

Balakrishna Vs Chiranjeevi: చిరంజీవి(Megastar Chiranjeevi) తో సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రతీ ఒక్కరు ఎంతో స్నేహం గా ఉంటారు, ఒక బాలయ్య(Nandamuri Balakrishna) తప్ప అని ఇండస్ట్రీ లో అందరు అంటూ ఉంటారు. వీళ్లిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది అనేది వాస్తవం అనేలా రీసెంట్ గా వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు జరిగాయి. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి ని రీసెంట్ గా బాలయ్య అవమానించడం, దానికి చిరంజీవి నుండి కూడా కౌంటర్లు రావడం వంటివి చాలానే చూసాము. ఒకపక్క వీళ్లిద్దరికీ సంబంధించిన పార్టీలు పొత్తులో ఉంటూ అధికారాన్ని చేపడుతున్నాయి. వీళ్ళ మధ్య గొడవలకు ఒకపక్క చంద్ర బాబు నలిగిపోతుంటే, మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా నలిగిపోతుంది. ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి వీళ్లిద్దరికీ ఏర్పడింది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే 80’s రీ యూనియన్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో బాలయ్య, నాగార్జున కనపడకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన ఇంట్లో జరుపుకుంటున్న దీపావళి సెలబ్రేషన్స కి ఆహ్వానించాడు. అందరూ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి విచ్చేసారు. విక్టరీ వెంకటేష్ దంపతులతో, అదే విధంగా అక్కినేని నాగార్జున దంపతులతో చిరంజీవి దంపతులు కలిసి ఫోటోలు దిగడం, ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ప్రత్యేకంగా ఫోటోలు దిగడం, వాటిని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతా బాగానే ఉంది కానీ, నందమూరి బాలకృష్ణ ని కూడా ఆహ్వానించి ఉండుంటే బాగుండేది అని చూసేవాళ్లకు అనిపించింది. అయితే చిరంజీవి బాలయ్య కి ఆహ్వానం అందించాడని, కానీ బాలయ్య నే రాలేదని ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది.

చిరంజీవి వైపు నుండి బాలయ్య పై ఎల్లప్పుడూ స్నేహ భావమే ఉంటుందని,బాలయ్య కి అది లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అంటున్నారు. అంతే కాదు, అందరూ చిరంజీవి ని పొగడడం , ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా భావించడం కూడా బాలయ్య కి ఇష్టం ఉండదట. అందుకే చిరంజీవి తో గ్యాప్ మైంటైన్ చేస్తూ వచ్చాడట. ఇప్పుడు గ్యాప్ చాలా పెరిగిందని టాక్. రాబోయే రోజుల్లో వీళ్ళు సందర్భాన్ని బట్టీ ఒకసారి కలవొచ్చేమో కానీ, వీళ్ళ మధ్య స్నేహం మాత్రం కుదరదు అనేది వాస్తవం. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కి బాలయ్య రాకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని అంటుంటారు. నాగార్జున తో కూడా ఆయనకు గతంలో చాలా గొడవలే జరిగాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper