Homeఎంటర్టైన్మెంట్Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సర్జరీ అవసరం అని చెప్పడం తో , షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ పడింది. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురి అవ్వాల్సిన పని లేదని బాలయ్య తొందరగానే కోలుకొని […]

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సర్జరీ అవసరం అని చెప్పడం తో , షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ పడింది. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురి అవ్వాల్సిన పని లేదని బాలయ్య తొందరగానే కోలుకొని మన ముందుకొస్తారని ఆ చిత్ర డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే కాసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ , ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ లు బాలయ్య కి జరిగిన ప్రమాదంపై స్పందిస్తూ, వాళ్ళు వేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘బాలా బాబాయ్ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన వేగంగా రీకవరీ అయ్యి , మంచి ఆరోగ్యం పొందాలని, మన ముందుకు పూర్వ వైభోగం తో వచ్చి గర్జించాలని ఆకాంషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ ట్వీట్ వేసిన కాసేపటికి ఎన్టీఆర్ ట్వీట్ వెయ్యడం విశేషం. దీన్ని బట్టీ వీళ్లిద్దరు ఏ పని చేసినా , ముందుగా మాట్లాడుకొని చేస్తారని అర్థం అవుతోంది. అయితే ఎప్పటి నుండో నందమూరి కుటుంబం డివైడ్ అయ్యిందని , బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారని , వీళ్లిద్దరి మధ్య అసలు మాటలే లేవని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూ వచ్చింది. అంతే కాకుండా ఎన్టీఆర్ టాపిక్ వచ్చినప్పుడల్లా , బాలయ్య అతని పట్ల చూపే నిర్లక్ష్యాన్ని చూసి, నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అనే భావన రాక తప్పదు. పైగా చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు ఎన్టీఆర్ సైలెన్స్ మైంటైన్ చేయడం పైన కూడా అప్పట్లో సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడిచింది.

అయితే వీటి అన్నిటికీ చెక్ పెడుతూ వీళ్లిద్దరు వేసినా ఈ ట్వీట్స్ ని చూస్తుంటే , మేమంతా ఒక్కటే అనే సందేశాన్ని అభిమానులకు ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వైపు నుండి బాలకృష్ణ పట్ల ఇదే రకమైన ప్రేమాభిమానులు మొదటి నుండి ఉన్నాయి కానీ , బాలయ్య మాత్రం వీళ్ళిద్దరిని పెద్దగా పట్టించుకోవట్లేదు అనే భావన ఇప్పటికీ అభిమానుల్లో ఉంది. వీళ్లంతా కలిసి ఒకే వేదిక పై చేరి , ఒకరి గురించి ఒకరు గొప్ప మాట్లాడుకుంటే తప్ప, సోషల్ మీడియా లో జరిగే ఇలాంటి ప్రచారాలకు అడ్డుకట్ట వెయ్యలేరు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper