Homeఎంటర్టైన్మెంట్Balakrishna New Movie Villain: బాలయ్య సినిమాలో విలన్ గా స్టార్ డైరెక్టర్...

Balakrishna New Movie Villain: బాలయ్య సినిమాలో విలన్ గా స్టార్ డైరెక్టర్…

Balakrishna New Movie Villain: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రేక్షకులందరిని మెప్పించడం ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక […]

Balakrishna New Movie Villain: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రేక్షకులందరిని మెప్పించడం ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించినవే కావడం విశేషం… ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో కూడా భారీ అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ విలన్ గా నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అంటే తమిళ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్ జే సూర్య కావడం విశేషం…

ప్రస్తుతం తెలుగు తమిళంలో ఎస్ జే సూర్య మంచి నటుడిగా రాణిస్తూనే నేషనల్ అవార్డులను సైతం కొల్లగొడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం సూర్య ను తీసుకున్నారట. మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు వేరే నటులను అనుకున్నప్పటికి బాలయ్య బాబు మాత్రం ఏరుకోరి సూర్య నే పెట్టుకోవాలని చెప్పారట.

దానికి దర్శకుడు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాలో బాలయ్య బాబు ఎస్ జే సూర్య ను ఢీ కొట్టబోతున్నాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని గోపీచంద్ మలినేని చెబుతుండటం విశేషం… ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

దాంతో మరోసారి గోపీచంద్ మలినేని – బాలయ్య బాబు కాంబినేషన్ కి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. మరి వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్న ఈ సినిమా ఎనలేని సక్సెస్ ని సాధిస్తుంది. బాలయ్య ఇమేజ్ ను అమాంతం పెంచుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper