Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balkrishna : బాలయ్యకు ఆ వస్తువు మరో గుండెకాయ, ఎక్కడికెళ్లినా తోడు ఉండాల్సిందే.. ఇంతకీ...

Nandamuri Balkrishna : బాలయ్యకు ఆ వస్తువు మరో గుండెకాయ, ఎక్కడికెళ్లినా తోడు ఉండాల్సిందే.. ఇంతకీ అది ఏమిటో తెలుసా?

Nandamuri Balkrishna :  బాలయ్యకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఫస్ట్ పద్మ అవార్డు సైతం అందుకున్నారు. భారత ప్రభుత్వం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని పద్మ అవార్డులు ప్రకటించింది. కళలు విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుండి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో ఢిల్లీలో బాలకృష్ణ ఈ అవార్డును అందుకోనున్నారు.

అలాగే హ్యాట్రిక్ పూర్తి చేసి… డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళుతున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్లో బాలకృష్ణ వరుస విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువే. అఖండ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన బాలకృష్ణ.. వీర సింహారెడ్డి,భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. బాలయ్యతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నెక్స్ట్ ఆయన అఖండ 2 కి సిద్ధం అవుతున్నారు. షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే బాలకృష్ణకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం వెలుగులోకి వచ్చింది. బాలయ్య ఎప్పుడూ ఒక బ్యాగ్ తో కనిపిస్తాడు. విదేశాలకు షూటింగ్స్, టూర్స్ కి వెళ్లినా అది ఉండాల్సిందే. ఆ బ్యాగ్ బాలకృష్ణ శరీరంలో మరొక అవయవం లాంటిదేనట. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమి ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. బాలయ్యకు ఆల్కహాల్ అలవాటు ఉంది. ఆయన వేడి వాటర్ తో మద్యం సేవిస్తాడట.

బాలయ్యకు ఇష్టమైన మ్యాన్షన్ హౌస్ బ్రాందీ బాటిల్, హాట్ వాటర్ ఆ బ్యాగ్ లో ఉంటాయట. వాటిని ఆయన స్వయంగా క్యారీ చేస్తారట. ఈ విషయాన్ని గతంలో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ స్వయంగా చెప్పడం విశేషం. బాలా మామయ్య హాట్ వాటర్ కలుపుకుని మ్యాన్షన్ హౌస్ తాగుతారు. ఒక బ్యాగ్ లో నిరంతరం ఒక మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, హాట్ వాటర్ మైంటైన్ చేస్తారు. చివరికి అమెరికా వెళ్లినా కూడా, అది తోడు తోడు ఉండాల్సిందే అని ఓపెన్ గా చెప్పారు. మామయ్య మ్యాన్షన్ హౌస్ బ్రాందీ తాగుతాడని తెలిశాక.. ఆ కంపెనీ సేల్స్, స్టాక్ వాల్యూ పెరిగాయని భరత్ చెప్పడం కొసమెరుపు. అయితే మద్యం తాగడం వంటి చెడు అలవాట్ల గురించి స్టార్స్ బయటపెట్టకపోతే మంచిది అనే వాదన ఉంది. ఇది వారి అభిమానులను ప్రభావితం చేసే అవకాశం చాలా ఉంది.

RELATED ARTICLES

Most Popular