Balakrishna: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన ఏకైక నటుడు బాలయ్య బాబు కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. అలాగే 15 సంవత్సరాల నుంచి బసవతారకం హాస్పిటల్ ద్వారా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకు సేవలను అందిస్తున్న బాలయ్య బాబు కి UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ ఒక గొప్ప గుర్తింపును ఇచ్చింది… ఇక దేశ సినీ చరిత్రలో ఈ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక నటుడు కూడా బాలయ్య బాబే కావడం విశేషం… ఇక ఈ ఘనత సాధించిన బాలయ్య బాబుని ఈనెల 30వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈవెంట్ లో సత్కరించనున్నారు…
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
మొత్తానికైతే బాలయ్య బాబు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకోవడం పట్ల తన అభిమానులు సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి బాలయ్య బాబు సినిమాలను చేస్తూ అలరిస్తున్నాడు. ఇక దేశంలోనే బాలయ్య బాబు సాధించిన ఘన కీర్తికి అతనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు సైతం మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక సినిమాలతో పాటు ఆయన సేవా కార్యక్రమాలను చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు…
ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకున్న ఇమేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…