Homeఎంటర్టైన్మెంట్Baahubali The Epic Re Release Collection: బాహుబలి ది ఎపిక్' రీ రిలీజ్ :...

Baahubali The Epic Re Release Collection: బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్ : మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు… ఏంటి జక్కన్న ఇది…

Baahubali The Epic Re Release Collection: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ రాజమౌళి ఇద్దరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. ఇక ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేశారు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి […]

Baahubali The Epic Re Release Collection: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ రాజమౌళి ఇద్దరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. ఇక ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేశారు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మొదటి రోజే 10 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టింది…ఇండియాలో దాదాపు 10 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లను రాబట్టిన సినిమాగా ఘన చరిత్రను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు రీ రిలీజ్ లో ఏ సినిమా కూడా మొదటి రోజు ఇంత భారీ వసూళ్లను రాబట్టలేదు.

Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?

కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి… ఇవాళ్ళ, రేపు వీకెండ్స్ కావడంతో ఈ సినిమా మీద ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే చాలా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.

మీడియం సినిమాకి ఏ రేంజ్ లో వసూలైతే వస్తాయో బాహుబలి రిలీజ్ కి ఆ రేంజ్ లో వసూళ్లు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా మీద ఎలాంటి క్రేజ్ తగ్గలేదు… మూవీ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు…

ఈ సినిమా రీ రిలీజ్ లో దుమ్మురేపుతోంది కాబట్టి లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను రాబడుతోంది. రీ రిలీజ్ లన్నింటిని కలిపి ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. హిందీలో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కుతోంది… చూడాలి మరి ఈ సినిమా రీ రిలీజ్ తో లెక్కలన్నీ సెట్ అవుతాయా లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper