Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ తేజ… కెరియర్ మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుసగా లవ్ స్టోరీలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సక్సెస్ లేక భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు… గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను కెమెరామెన్ నుంచి దర్శకుడిగా మారడానికి గల కారణాలేంటో చాలా స్పష్టంగా వివరించారు…అప్పట్లో బాలీవుడ్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన తేజకి ఒకరోజు అమితాబచ్చన్ పిలిచి మరి ‘తేరే మేరే సప్నే’ అనే సినిమాను మనం ప్రొడక్షన్లో చేస్తున్నాం… దానికి నువ్వే సినిమాటోగ్రాఫర్ అని చెప్పారట. దాంతో సరే అని తేజ ఒప్పుకున్నాడట. దర్శకుడితో కూర్చొని కథ విను అని చెప్పారట. దానికి తేజ కూడా దర్శకుడితో కూర్చొని కథను విన్నాడు. కథ తేజకి ఏమాత్రం నచ్చలేదట. ఈ విషయాన్ని అమితాబచ్చన్ కి చెప్పి కథ ఏం బాలేదు. ఈ సినిమా చేయకపోవడమే బెటర్ అని చెప్పినప్పటికి అమితాబచ్చన్ మాత్రం ఈ సినిమాని మనం అనౌన్స్ చేశాం…కాబట్టి సినిమా ఖచ్చితంగా చేయాల్సిందే. కథలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నువ్వు చేయమని చెప్పారట. దాంతో తేజ దర్శకుడితో కూర్చొని చాలా వరకు కథలో మార్పులు చేర్పులు చేసి మొత్తానికైతే ఒక షేప్ తీసుకొచ్చారట.
Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?
షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే సమయంలో అమితాబచ్చన్ మళ్ళీ తేజని పిలిచి డైరెక్టర్ కొంచెం భయపడుతున్నాడు. నువ్వే కొంచెం దగ్గర ఉండి చూసుకో అని చెప్పినప్పటికి తేజ మాత్రం దర్శకుడు భయపడితే నేనేం చేయాలి అని అనుకున్నారట. ఇక ఇంతలో తేజకి వచ్చిన ఒక ఆలోచన ప్రకారం ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి. కాబట్టి కొరియోగ్రాఫర్ ను పిలిచి రెండు సాంగ్స్ చేద్దాం. ఆలోపు దర్శకుడికి ధైర్యం వస్తుందని చెప్పాడట. తేజ చెప్పినట్టుగానే కొరియోగ్రాఫర్ ను పిలిచి రెండు సాంగ్స్ చేయించారట.
దాంతో దర్శకుడికి దైర్యం వచ్చి సినిమాని స్టార్ట్ చేశారట. కానీ దర్శకత్వంలో ఆ దర్శకుడు అనుసరిస్తున్న విధానాలు తేజకి కొంచెం కొత్తగాను, ఇంకొంచెం చెత్తగాను అనిపించయట…మొత్తానికైతే సినిమా మొత్తాన్ని తేజనే ఘోస్ట్ డైరెక్టర్ గా డైరెక్షన్ చేశారట. ఇక ఈ సినిమాకి ఆ దర్శకుడికి లక్ష రూపాయలు ఇస్తే తేజకి 8 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారట.
సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ దర్శకుడు రెమ్యూనరేషన్ గా నెక్స్ట్ సినిమాకి 40 లక్షలు ఇవ్వగా, తేజ కు మాత్రం తొమ్మిది లక్షలు ఇచ్చారట. ఈ సినిమా మొత్తం తీసింది నేనే నాకేమో అంత తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అతనికి అంత ఎక్కువగా ఇస్తున్నారు అని తేజ ఇగో హర్ట్ అయి ఎలాగైనా సరే మనం కూడా డైరెక్టర్ అవ్వాలని అప్పుడు నిశ్చయించుకున్నారట. చిత్రం సినిమాతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే…